నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (NMMSS) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ పొడిగించింది. తాజా ప్రకటన ప్రకారం, 2025 అక్టోబర్ 18 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అలాగే పరీక్ష ఫీజును కూడా చెల్లించవచ్చు. ఈ స్కాలర్‌షిప్ కోసం 2025-26 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇప్పటి వరకు దరఖాస్తు చేయని అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
ప్రధానోపాధ్యాయులు అక్టోబర్ 22లోపు విద్యార్థుల ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ల డౌన్‌లోడ్ కాపీలు, ఫీజు రసీదులు , నామినల్ రోల్స్‌ను రెండు కాపీలు చొప్పున సంబంధిత జిల్లా విద్యా అధికారికి (DEO) సమర్పించాలి. తదుపరి, డీఈఓలు ధ్రువీకరించిన పత్రాలను అక్టోబర్ 24 లోపు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయం, హైదరాబాద్‌కు పంపించాల్సి ఉంటుంది.
Guntur Train Incident : పెదకూరపాడు రైలులో అ*త్యాచారం నిందితుడు అరెస్ట్ !
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ స్కాలర్‌షిప్‌ను ప్రతి సంవత్సరం అందిస్తోంది. ఇందులో ఎంపికైన విద్యార్థులు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సంవత్సరానికి రూ.12,000 చొప్పున ఆర్థిక సహాయం పొందుతారు. పేద విద్యార్థులు 8వ తరగతి తర్వాత చదువు మానేయకుండా ఉండేందుకు, వారిని ప్రోత్సహించి విద్యను కొనసాగించేందుకు ఈ స్కాలర్‌షిప్ స్కీమ్ అమలులో ఉంది. అర్హులైన విద్యార్థులు నిర్దేశిత తేదీల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
