Site icon NTV Telugu

MLC Kavitha: నేడు నిజామాబాద్‌కు ఎమ్మెల్సీ కవిత.. ఇందల్వాయి టోల్ గేట్ వద్ద నుంచి భారీ ర్యాలీ

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు కవిత వెళ్తున్నారు. ఇందల్వాయి టోల్ గేట్ నుంచి నిజామాబాద్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. డిచ్‌పల్లి వద్ద కవితకు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలుకుతారు. సుభాష్ నగర్ నుంచి బైపాస్ రోడ్డు మీదుగా ఎస్ ఎఫ్ ఎస్ సర్కిల్ వరకు బీఆర్ ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఎస్‌ సర్కిల్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి కవిత పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి కవిత ప్రసంగిస్తారు.

Read also: Hyderabad Police: న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌.. పబ్‌లు, బార్‌లపై పోలీసుల ఫోకస్‌..

ఆనవాయితీగా కొనసాగాల్సిన సంప్రదాయాలను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చుకుంటూ నియంతృత్వ ధోరణిలో ముందుకు సాగుతోందని కవిత పేర్కొన్నారు. ఇందులో భాగంగా తొలినాళ్లలో తెలంగాణ లోగోను మార్చేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఆ తర్వాత తెలంగాణ తల్లి ఇమేజ్‌నే మార్చే దిశగా అడుగులు వేసింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కోట్లాది మంది పూజించే విగ్రహం కాదు, మరో విగ్రహాన్ని ఎంపిక చేసి ఆవిష్కరించారు. ఉద్యమ సమయంలో ఉద్వేగ కేంద్రంగా మారిన తెలంగాణ తల్లి విగ్రహానికి ఇప్పటికీ ప్రజలు పూజలు చేస్తున్నారు. ఆదివారం నిజామాబాద్‌కు రానున్న కవిత.. ఉద్యమ సమయంలో సుభాష్‌నగర్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పిస్తారు.
Komuravelle: నేడు మల్లికార్జున స్వామి కళ్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు

Exit mobile version