Site icon NTV Telugu

Leopard: సిద్దుల గుట్టలో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు

Leapord

Leapord

Leopard: నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నవనాధ సిద్ధుల గుట్ట సమీపంలో భయం భయంగా ఉంది. చిల్డ్రన్ పార్క్ సమీపంలోని రాళ్ళ మధ్యలో చిరుతను స్థానికులు చూశారు. దీంతో చిరుత వీడియోను భక్తులు చిత్రీకరించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరుత సంచారంతో భక్తులు, పట్టణ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. చిరుతను పట్టుకోవడానికి బోన్ ఏర్పాటు చేసి బంధించాలని భక్తులు కోరుతున్నారు.

Read Also: Heartbreaking incident in AP: పోషించలేక చిన్నారిని వదిలివెళ్లిన తల్లి.. హృదయాన్ని కదిలిస్తోన్న లెటర్..!

మరోవైపు, చిరుత సంచారంతో సిద్ధుల గుట్ట ప్రధాన ద్వారానికి ఆలయ అధికారులు తాళం వేశారు. పర్యాటకులు, భక్తులకు నవనాధుల సిద్ధుల గుట్టపైకి అనుమతి లేదని తెలిపారు. చిరుత సంచరిస్తున్న సిద్ధుల గుట్ట ప్రాంతాన్ని అటవీ శాఖ అధికారులు సందర్శించారు. అక్కడ, చిరుత సంచారాన్ని నిర్ధారించారు. సిద్ధుల గుట్టపై వివిధ ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత జడ దొరికే వరకు సిద్ధుల గుట్ట పార్కు దగ్గరకు అనుమతి లేదని ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు.

Exit mobile version