Nizamabad: ఛీ..ఛీ.. సమాజం ఎటు పోతోంది.. అని అనిపిస్తుంటుంది. చాలా మందిలో నేర ప్రవర్తనతో పాటూ పైశాసికత్వం రోజు రోజుకూ పెరిగిపోతోంది. కొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు ఛీ నీఛుల్లారా కామ పిశాచాల్లా తయారేంటి అనిపిస్తుంటుంది. అలాంటి కామాంధులకు మహిళ అయి ఉండాలి కానీ బాలికనా, తల్లి, చెల్లి కూడా చూడటంలేదు.. కన్న ప్రేమకే కత్తితో పొడిచి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలు పై కూడా అత్యాచారం చేసేందుకు కూడా వెనుకడాటం లేదు. అయితే ఓ ఘటన మనిషి పైశాచిక కామానికి నిదర్శనంగా నిలిచింది. ఆమెకు ఇద్దరు పిల్లలు కానీ మతిస్థిమితంలేదు. తన లోకంలో తనే మట్లాడుతూ తను ఏం చేస్తుందో తెలియని లోకంలో బతుకుతుంది. అలాంటి మతిస్థిమితం లేని ఓ మహిళపై బీహార్ కు చెందిన ఓ వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. మతి స్థిమితం లేదని తెలిసి కూడా కామంతో ఆమెపై తన కామవాంఛను తీర్చుకున్నాడు. అయితే ఈ ఘటనను చూసిన ఇద్దరు కొడుకులు ఆ వ్యక్తిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది.
Read also: Bro: గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ లాక్ అయ్యిందా…
నిజామాబాద్ పట్టణంలోని శ్మశాన వాటికలో నాగుల దశరథ్ (27), మల్లేష్ (21) కూలీలుగా పనిచేస్తున్నారు. ఇద్దరు సోదరులు మతిస్థిమితం లేని తల్లితో కలిసి గుర్బాబడి ప్రాంతంలో నివసిస్తున్నారు. బీహార్‌కు చెందిన అరుణ్ అనే వలస కూలీ వారి ఇంటి సమీపంలోనే ఉంటున్నాడు. ఇతను మతిస్థిమితం లేని తల్లిపై కన్నేశాడు. గత శుక్రవారం రాత్రి సోదరులు దశరథ్, మల్లేష్ సినిమాకి వెళ్లగా ఇంట్లో తల్లి ఒంటరిగా ఉంది. ఇది గమనించిన అరుణ్ ఇంట్లోకి చొరబడి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన ఇద్దరు అన్నతమ్ములు తల్లి పరిస్థితి చూసి నిర్ఘాంతపోయారు. అదే సమయంలో బయటకు వెళ్లిన ఆమె ఇద్దరు కుమారులు ఇంటికి వచ్చి గమనించారు. వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తల్లిపై అఘాయిత్యానికి పాల్పడిన ఆ వ్యక్తిపై దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గాయాలతో పడి ఉన్న అరుణ్‌ని గమనించిన ఆటో డ్రైవర్ 108 అంబులెన్స్‌కు సమాచారం అందించాడు. తీవ్రగాయాలతో నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న హమాలీ కూలి ఆదివారం మృతి చెందింది. దీంతో పోలీసులు సోదరులు మల్లేష్, దశరథ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మృతుడు బీహార్‌లోని సహర్సా జిల్లా మక్కరి ప్రాంతానికి చెందిన అరుణ్‌గా పోలీసులు గుర్తించారు. అతడి హత్యపై పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని బీహార్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
Bro: గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ లాక్ అయ్యిందా…
