Site icon NTV Telugu

Dedicated Commission: నేడు నిజామాబాద్ జిల్లాలో బీసీ డెడికేటెడ్ కమిషన్ పర్యటన..

Dedicated Commission

Dedicated Commission

Dedicated Commission: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు సంబంధించి ఏర్పాటు చేసిన డెడికేటెడ్‌ కమిషన్‌ జిల్లాల వారీగా బహిరంగ విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. ఈనేపథ్యంలో నేడు నిజామాబాద్ జిల్లాలో బీసీ డెడికేటెడ్ కమిషన్ పర్యటించనుంది. కులాల స్థితి గతులపై జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అభిప్రాయ సేకరణ చేయనున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులు, కుల సంఘాలు, బీసీ సంఘాలు స్వచ్ఛంద సంస్థల నుంచి కమిషన్ అభిప్రాయ సేకరణ చేయనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

Read also: Vizag Central Jail: విశాఖ సెంట్రల్‌ జైలులో అవాంఛనీయ ఘటనలు..! ఇద్దరు సీనియర్ అధికారులపై వేటు..

అయితే.. బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్, సభ్యులు గురువారం జిల్లాకు రానున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. స్థానిక సంస్థల ద్వారా కల్పించాల్సిన రిజర్వేషన్లపై కమిషన్ సభ్యులు ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజాభిప్రాయాలను సేకరిస్తారని అన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా కులాల స్థితిగతులపై వివిధ సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను ప్రత్యేక కమిషన్ కు తెలియజేయవచ్చని సూచించారు. అభిప్రాయాలు వ్యక్తం చేసే వారు తమ వాదనలకు మద్దతుగా తమ వద్ద ఉన్న సమాచారం, మెటీరియల్, ఆధారాలను తమ అభ్యర్థనలతో సమర్పించాలని ఆయన అన్నారు. కాగా.. బూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన డెడికేటెడ్‌ కమిషన్‌ రిపోర్ట్‌ అందించేదుంకు గడువు నిన్నటితో అనగా (బుధవారంతో) ముగిసింది.

Read also: Air Hostess: ఎయిర్‌ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ప్రయాణికుడు.. ఆ తరువాత..

Exit mobile version