Site icon NTV Telugu

Nizamabad: దారుణం.. భర్తతో కలిసి తల్లిని చంపిన కూతురు

Crime

Crime

రోజు రోజుకు సమాజంలో ఘోరాలు పెరిగిపోతున్నాయి. డబ్బు, ప్రేమ కోసం, కుటుంబ వ్యవహారాలు.. ఇలా ఇంకెన్నో వాటి కోసం తల్లి, తండ్రి, కొడుకు, కూతురు అని చూడకుండా హతమారుస్తున్నారు. వారు సంతోషంగా ఉండటం కోసమని రక్తం పంచుకుని పుట్టిన వాళ్లను సైతం లేపేస్తున్నారు. ఈరోజుల్లో కేవలం డబ్బులు ఉంటే హాయిగా బతకవచ్చనే ఉద్దేశంతో ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు. తాజాగా.. కన్న తల్లినే హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

Read Also: Gunfire in America: అమెరికాలో కాల్పులు.. తిరుపతి యువకుడికి తీవ్రగాయాలు

వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం 300 క్వార్టర్‌లో దారుణం జరిగింది. భర్తతో కలిసి తల్లిని చంపింది ఓ కూతురు. తన కుటుంబ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకుంటుందని తల్లి పై కక్ష పెంచుకుంది. ఈ క్రమంలో గాఢ నిద్రలో ఉన్న తల్లి విజయ గొంతు నులిమి చంపిన కూతురు సౌందర్య, రమేష్ చంపేశాడు. అనంతరం.. అనారోగ్యంతో మృతి చెందినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే.. గొంతుపై గాయాలు ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. భార్య భర్తలను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

Read Also: OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు వెబ్ సిరీస్ లు ఏవంటే..?

Exit mobile version