నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మహిళకు లిప్ట్ ఇచ్చినట్టే ఇచ్చి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also Read:Singapore: ఎరక్క పోయి.. ఇరుక్కు పోయారు.. సె*క్స్ వర్కర్లపై దాడి.. ఇండియన్స్ అరెస్ట్
పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన మహిళకు జైతాపూర్ కు చెందిన బాలకృష్ణ అనే నిందితుడు. లిఫ్ట్ ఇచ్చి హత్య చేశాడు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎడపల్లి మండలం దూపల్లి గేట్ వద్ద లిఫ్ట్ ఇచ్చి .. ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలు కోసం హత్య చేశాడు నిందితుడు. మృతదేహాన్ని ఆటోలో తరలిస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు. అనంతరం నిందితుడి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.
Also Read:POK: పాక్ “పోకిరి రాజ్యం” : పీఓకే నాయకుడు జమీల్ మక్సూద్
మృతురాలు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా, కొండల్ వాడికి చెందిన శీలంవార్ లింగవ్వ (55)గా గుర్తించారు. బతుకమ్మ పండుగ నిమిత్తం జమ్లంలోని తన కూతురి ఇంటికి వచ్చిన హత్యకు గురైంది లింగవ్వ. మహిళలు ఎవరిని పడితే వారిని నమ్మి లిప్ట్ ఎక్కి వెళ్లవద్దని.. పోలీసులు సూచించారు.
