NTV Telugu Site icon

Robbery in Nizamabad: మిఠాయి తినిపించి.. కాళ్లు, చేతులు కట్టేసి రూ.30వేలు దోపిడీ..

Robbery In Nizamabad

Robbery In Nizamabad

Robbery in Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో దారిదోపిడి కలకలం రేపింది. ఓ యువకుడికి కాళ్లు చేతులు కట్టేసి అతని వద్ద నుంచి రూ.30 వేల అపహరించారు దుండగులు. ఈ ఘటన నవీపేట ఠాణా పరిదిలో మల్కాపూర్‌ శివారులో చోటుచేసుకుంది.

read also: ADR Report: ఏపీ ఎమ్మెల్సీల్లో 75 శాతం మంది ధనవంతులే.. రిచెస్ట్ ఎమ్మెల్సీగా నారా లోకేష్

అమిత్‌ పాటిల్‌ అనే యువకుడు మహారాష్ట్రలోని కొరేగాంకు చెందినవాడు. అతను బెంగళూరులోని ఓ దాబాలో పనిచేస్తున్నాడు. రాఖీ పండగకు తన ఇంటికి వెళ్లే క్రమంలో శనివారం నిజామాబాద్‌ రైల్వేష్టేషన్‌ కు వెళ్లాడు. స్టేషన్‌ బయట గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అమిత్‌ పాటిల్‌ ను గమనించి వారు మహారాష్ట్ర తీసుకెళతామని వారు కూడా అక్కడికే వెళుతున్నామని తెలిపడంతో.. వారిని నమ్మిన అమిత్‌ వ్యాన్‌ ఎక్కాడు. వ్యాన్‌ కొద్దిదూరం వెల్లాక ఆముగ్గురు అమిత్‌ కు మిఠాయి తినిపించారు. అయితే ఆ మిఠాయిలో మత్తు మందు వుండటంతో అమిత్‌ స్పృమ కోల్పోయాడు.

దీంతో ఇదే అలుసుగా భావించి వారు ముగ్గురు అమిత్‌ వద్ద వున్న రూ.30 వేలు నగదును దోచుకున్నారు. అతనికి చేతులు, కాళ్లు, నోట్లో బట్టకు కుక్కి మల్కాపూర్‌ శివారులోని ఓ వెంచర్‌ వద్ద పడేసి వెళ్లిపోయారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆ యువకుడి ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుడు ప్రాణ హాని లేకపోవడంతో.. ఊపిరి పీల్చుకున్నారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ నరహరి తెలియజేశారు.

Tiger Wandering: కోటపల్లి అడవుల్లో మరోసారి పులి అలజడి.. పశువులపై దాడి

Show comments