Constable Pramod : రౌడీ షీటర్ రియాజ్ చేతిలో మృతి చెందిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సీపీ సాయి చైతన్య పరామర్శించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ ప్రమోద్ భార్యకు ఆర్థిక సహాయం చెక్కుతో పాటు 300 గజాల ఇంటి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ డీజీపీ అందజేశారు.
ప్రమోద్ భార్య మాట్లాడుతూ.. “డీజీపీ సార్ మా కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఎలాంటి కష్టం వచ్చినా ప్రభుత్వం మాకు తోడుగా ఉంటుందని నమ్మకం కలిగింది. నా భర్త లేని లోటు ఎప్పుడూ తీర్చలేరు, కానీ మా కుటుంబానికి జరిగిన విధమైన బాధలు మరే ఇతర కుటుంబానికి జరగకుండా పోలీసులు పనిలో వెళ్తున్నప్పుడు సరిపడిన ఆయుధాలు కల్పించాలి” అని పేర్కొన్నారు.
అనంతరం.. డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశంలో వివరించగా.. రియాజ్‌ను పట్టుకునే సమయంలో పోలీసులకు సహకరించి గాయపడ్డ ఆసీఫ్‌కు రూ.50,000 రివార్డు అందించారని తెలిపారు. అలాగే, కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటిరూపాయల ఎక్స్‌గ్రేషియా అందజేసి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. రియాజ్ ఎన్‌కౌంటర్‌పై విచారణకు ఆదేశాలు ఇవ్వబడినట్లు, డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ కొనసాగుతున్నట్లు డీజీపీ తెలిపారు. డీజీపీ శివధర్ రెడ్డి, తెలంగాణలో ప్రస్తుతం 65 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని, వారందరూ జనజీవన స్రవంతిలోకి తిరిగి రావాలని పిలుపునిచ్చారు.
Tata: పండగ సీజన్ లో అదరగొట్టిన టాటా మోటార్స్.. ఏకంగా లక్ష కార్ల సేల్..
