NTV Telugu Site icon

Nirmala Sitharaman: పెట్రోల్ మీద వ్యాట్ వేసింది తెలంగాణ.. కేంద్రం కాదు

Nirmalasetaraman Kcr

Nirmalasetaraman Kcr

Nirmala Sitharaman: పెట్రోల్ మీద వ్యాట్ వేసింది తెలంగాణ.. కేంద్రం కాదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాంపైన్ లో నా మొదటి మీటింగ్ అని అన్నారు. నవంబర్ 30న జరిగే ఎన్నికలు తెలంగాణకు చాలా కీలకమని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ ఎన్నికల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం వెంగళ్ రావు నగర్‌లోని ముగ్ధా బాంక్వెట్ హాల్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఎడ్యుకేటెడ్, ప్రొఫెషనల్స్ తో పాటు అన్ని సెక్షన్స్ ఉన్నటువంటి కాన్స్టిట్యూఎన్సీ అన్నారు. తెలంగాణలో ఈ ఎలక్షన్స్ చాలా ముఖ్యమన్నారు. ఈ ఎలక్షన్స్ ఇంపార్టెంన్స్ ప్రజలకు తెలపాలన్నారు. 2014లో ఆంధ్ర- తెలంగాణ విభజన జరిగినప్పుడు తెలంగాణ దగ్గర ఎక్కువ డబ్బు సొమ్ము వుండే అన్నారు. హైదరాబాద్ డెవలప్మెంట్ అయి రెవెన్యూ సెంటర్ గా మారిందన్నారు. రెవెన్యూ జానరేట్ చేసే ప్రాంతం తెలంగాణ లో హైదరాబాద్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వుందని తెలిపారు. కానీ అలాంటి తెలంగాణ ను రెవెన్యూ ని డెఫిసిట్ చేసిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పాలసీ వల్ల మంచి కంపెనీలు హైదరాబాద్ కి వస్తున్నాయని తెలిపారు.

Read also: Bandi Sanjay: అందుకే వద్దని చెప్పా.. కేంద్ర మంత్రి పదవిపై బండి ఆసక్తికర వ్యాఖ్యలు..

కాళేశ్వరం ప్రాజెక్ట్ చేయడానికి సత్తా లేకుండా పోయిందని ఘూటు వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పాలనా పార్టీ, సరిగ్గా డబ్బు యూస్ చేయలేని పార్టీ మనకు కావాలా..? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో హయ్యర్ పూర్ సెక్షన్ ఉందని, మన ఫ్యూచర్ అప్పుల పాలు అవుతుందని అన్నారు. కోవిడ్ లాంటి టైంలో బారో చేసి ఫైనాన్స్ ని, ఫ్యూచర్ కి బర్డెన్ పడకుండా కేంద్ర ప్రభుత్వం నడిపిందన్నారు. తెలంగాణని అప్పుల పాలు చేసారని మండిపడ్డారు. ఒక్క ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలె సరిగ్గా అని.. ఇచ్చిన వాగ్దానాలు మరిచారు..దళిత సీఎం ఎటు పోయింది? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో యంగ్ కాండిడేట్ ఉన్నాడు సపోర్ట్ చేయాలని కోరారు. డెవలప్మెంట్ చేసే పార్టీ కావాలన్నారు. ప్రజలకు పనికొచ్చే పనులు చెయ్యట్లేదు ప్రస్తుతం ఉన్న పార్టీ అన్నారు. పెట్రోల్ మీద వ్యాట్ తెలంగాణ వేసింది కేంద్రం కాదన్నారు. పేరులో తెలంగాణ తీసేసి తెలంగాణ గురించి అన్ని మాట్లాడుతున్నరు ఈరోజు అంటూ మండిపడ్డారు.
Congress Manifesto 2023: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. రైతులకు వడ్డీ లేని రుణాలు, మద్దతు ధర!

Show comments