Site icon NTV Telugu

Minister Seethakka: మాకు ఎలాంటి కక్ష లేదు.. అల్లు అర్జున్‌ అరెస్ట్‌ పై సీతక్క కామెంట్‌

Minister Seetakka

Minister Seetakka

Minister Seethakka: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అరెస్ట్‌ సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌ అరెస్ట్‌ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కారణమని వస్తున్న వార్తలకు మంత్రి సీతక్క స్పందించారు. అల్లు అర్జున్ పైన మాకు ఎలాంటి కక్ష లేదని క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ అరెస్టు చట్ట ప్రకారం జరిగిందని తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హైస్కూల్ లో విద్యార్థులకు పెట్టె టిఫిన్ పరిశీలించారు మంత్రి. అనంతరం వారితో కలిసి టిఫిన్ చేశారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌ అరెస్టులో ఎవ్వరి జోక్యం లేదని అన్నారు.

Read also: Fake Currency Gang: నకిలీ నోట్ల ముఠాను పట్టించిన ఏటీఎం..!

అల్లు అర్జున్ పైన మాకు ఎలాంటి కక్ష లేదని అన్నారు. అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డి తరుపున సీఎం రేవంత్‌ రెడ్డికి బంధుత్వం ఉందని మంత్రి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చుట్టం అయి ఉంటారన్నారు. కక్ష పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదని మంత్రి సీతక్క అన్నారు. తొక్కి స లాటలో మహిళ ప్రాణాలు కోల్పోయిందని గుర్తు చేశారు. చట్టం ప్రకారం వాళ్ళు చేసారని అన్నారు. చట్టం ఎవ్వరి చుట్టం కాదన్నారు. అందులో ఎవ్వరు జోక్యం చేసుకోలేదని మంత్రి సీతక్క అన్నారు.
Telangana Ministers: భూపాలపల్లి జిల్లాలో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర పర్యటన..

Exit mobile version