NTV Telugu Site icon

Nikhil Siddhartha: నన్ను డ్రగ్స్ తీసుకోమ్మని ఆఫర్ చేశారు.. నిఖిల్ సంచలన వ్యాఖ్యలు

Nikhil On Drugs

Nikhil On Drugs

Nikhil Siddhartha Comments On Drugs Issue In An Event: చాలా సార్లు తనని డ్రగ్స్ తీసుకోమ్మని ఆఫర్ చేశారని, కానీ తాను తీసుకోలేదని యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్ దుర్వినియోగం & డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఓ కార్యక్రమం నిర్వహించింది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలనపై ప్రచారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిఖిల్ మాట్లాడుతూ.. డ్రగ్స్‌కి అందరూ దూరంగా ఉండాలని సూచించాడు. నార్కోటిక్స్‌కి అలవాటు పడితే, అదే డెత్ సెంటన్స్ అని హెచ్చరించాడు. స్టూడెంట్స్‌కు అందమైన జీవితం ఉందని, ఆ జీవితాన్ని ఎంజాయ్ చేయాలని, కానీ డ్రగ్స్‌కి మాత్రం నో చెప్పండని సలహా ఇచ్చాడు. పార్టీస్‌కి వెళ్లినా, అక్కడ డ్రగ్స్ మాత్రం తీసుకోవద్దన్నాడు. కొందరు చేస్తున్న తప్పిదం వల్ల సినిమా ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తుందని, దాని కారణంగా కొందరు నిందితులుగా మారుతుందే, మరికొందరు బాధితులుగా మిగులుతున్నారని చెప్పాడు. ఇలాంటి పరిణామాలు సమాజానికి మంచిది కాదన్నాడు. త్వరలో డ్రగ్ ఫ్రీ తెలంగాణ అవ్వాలని తాను కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.

Tesla: ఇండియాకు రానున్న టెస్లా కారు.. రెడ్ కార్పెట్ పరుస్తున్న రాష్ట్రాలు

ఇదే కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన మరో నటుడు ప్రియదర్శిని రామ్ కూడా మాట్లాడుతూ.. 10 సంవత్సరాల క్రితం తాను సిగరెట్ తాగానని గుర్తు చేసుకున్నారు. అయితే.. దానికి బానిస కావొద్దని అనుకున్నానని, అనుకున్నట్లే కొంతకాలం తర్వాత తనకు పరివర్తన వచ్చిందని, దాంతో తాను సిగరెట్ తాగడం మొత్తానికే మానేశానని చెప్పారు. ఇప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా తాను చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. డ్రగ్స్ వినియోగంపై అందరికీ అవగాహన రావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు ఇలాంటి అవేర్‌నెస్ కార్యక్రమాన్ని.. నార్కోటిక్స్ విభాగం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు పరివర్తన రావాల్సిన అవసరం ఉందన్న ఆయన.. నార్కోటిక్స్ వింగ్ పోలీసులకు సెల్యూట్ కొట్టారు.

Samosa History: భారతదేశంలో సమోసా ఎక్కడ నుండి వచ్చింది? దీని చరిత్ర ఏమిటో తెలుసా?

అనంతరం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను కొద్దిరోజుల క్రితమే ప్రారంభించామన్నారు. డ్రగ్స్ అనేది ప్రస్తుత సమాజంలో పెద్ద సమస్యగా మారిందని, 11.50 కోట్ల మంది డ్రగ్స్‌కు బానిసలయ్యారని తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ నుండి వివిధ రకాలుగా డ్రగ్స్ ఇక్కడికి చేరవేస్తున్నారని చెప్పారు. సైబర్ క్రైమ్, నార్కోటిక్స్ అనేవి రెండు ప్రధాన సమస్యలని.. ఎంతోమంది విద్యార్థులు డ్రగ్స్‌కు ఎడిక్ట్ అవుతున్నారని అన్నారు. ఈ పరివర్తన కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మార్పు రావాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ నిర్ముూలనకు అందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.