NTV Telugu Site icon

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత..!

Neet Students

Neet Students

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ విద్యార్థి సంఘాల నేతలు కాచిగూడలోని ఆయన ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ, డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్‌, పీవైఎల్‌ విద్యార్థి సంఘాల నాయకులు ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. రాష్ట్రంలోని నీట్ విద్యార్థులకు న్యాయం చేయకుంటే కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో ఎమ్మెల్సీ వెంకట్‌తోపాటు విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేశారు. SFI, PDSU, NSUI, AISF విద్యార్థి సంఘాలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారిని నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నీట్ అంశంపై కేంద్రమంత్రిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరామని, ఇవ్వకపోవడంతో ఇంటిని ముట్టడించామని విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. కొద్ది రోజులుగా నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Today Gold Price: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు! అస్సలు ఊహించరు

నీట్ అంశంపై కేంద్రమంత్రిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరామని, ఇవ్వకపోవడంతో ఇంటిని ముట్టడించామని విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. కొద్ది రోజులుగా నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ వ్యవహారంపై తెలిపేందుకు కిషన్ రెడ్డి ఆపాయింట్ మెంట్ కోరినా అధికారుల్లో స్పందన లేదని మండిపడ్డారు. దీంతో ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ముట్టడించామని తెలిపారు. ఇప్పటి కైనా కేంద్ర మంత్రి స్పందిచకపోతే ఉద్రికత్త చేస్తామని హెచ్చరించారు. అయితే దీనిపై కిషన్ రెడ్డి మాట్లాడక పోవడం విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు నీట్ రద్దు కై ఓయూలో టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ దీక్ష చేపట్టారు. సీబీఐతో విచారణ జరపాలని, నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. NTA డైరెక్టర్ ను అరెస్ట్ చేయాలని కోరారు. ఓయూ మెయిన్ లైబ్రరీ ముందు చనగాని దీక్ష లో కూర్చున్నారు. NSUI ఓయూ అధ్యక్షులు మెడ శ్రీనివాస్ తో పాటు పలువురు నేతలు దీక్షకు సంఘీభావం వ్యక్తం చేశారు.
Hyderabad No-1: పొదుపులో నెం.1గా భాగ్యనగర వాసులు.. ది గ్రేట్ ఇండియన్ వాలెట్ సర్వే

Show comments