NTV Telugu Site icon

ప్రమాదపు అంచుల్లో సహజ సంజీవని.. కాపాడుకుందాం :టీఎస్‌ ప్రభుత్వం

neem-trees 1

సహజ సంజీవని, కల్పతరువు, ఆరోగ్య ప్రదాత, ఆరోగ్య మంజరి ఇలా ఎన్నో పేర్లు ఉన్న వేప చెట్టు ఇప్పుడు ప్రమాదపు అంచుల్లో ఉందని.. దానిని కాపాడుకుందామని పిలుపునిచ్చింది తెలంగాణ సర్కార్‌. వేపచెట్లకు డై బ్యాక్‌ వ్యాధి సోకి చనిపోతున్నాయని ఈ మేరకు వ్యవసాయ శాఖ తెలిపింది. ఫోమోప్సిస్‌ అజాడరిక్టే అనే శిలింద్రం సోకడ వల్ల ఇలా జరుగుతోందని వెల్లడించింది. రైతులు, ప్రజలు ఇంటిలో, పంటపొలాల వద్ద ఉన్న వేపచెట్టుకు ఈ వ్యాధి సోకకుండా బాధ్యతయుతంగా వ్యవహరించాలన్నారు.

వేప చెట్టకు మొదలు వద్ద కార్బెండిజయ్‌ అనే మందును 1 లీటర్‌ నీటిలో 2గ్రాములు కలిపి పిచికారి చేయాలని పేర్కొంది. అలాగే వారం రోజుల తరువాత థయోఫనేట్‌ మిథైల్‌ను 1లీటర్‌ నీటిలో 2గ్రాములు కలిపి మొదలు తడిచేలా పిచికారి చేయాలని సూచించింది. మళ్లీ 20 రోజుల తరువాత ప్రోఫినోపాస్‌ మందును 1 లీటర్‌ నీటిలో 3మిల్లీలీటర్లు కలిపి మొదలులో పిచికారి చేయాలని వెల్లడించింది.