NDRF Team Saves Biker Who Stuck In EC Nagu In Hyderabad: హిమాయత్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో.. అధికారులు ఆరు గేట్లు ఎత్తేశారు. దీంతో.. ఈసీ నాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. ఈ కారణంగా.. హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దనున్న సర్వీస్ రోడ్డుపై నీళ్లు తీవ్రంగా ప్రవహిస్తుండడంతో, రాకపోకలు నిలిచిపోయాయి. అయితే.. ఈ ప్రవాహ తీవ్రతను గమనించని ఓ యువకుడు రోడ్డు దాటేందుకు ప్రయత్నించగా, మధ్యలోనే చిక్కుకున్నాడు. దాదాపు కొట్టుకుపోయే ప్రమాద స్థాయికి చేరుకున్నాడు. దాంతో ఆ యువకుడు తనని కాపాడాలని కేకలు వేశాడు. ఈ విషయం తెలుగుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం.. వెంటనే రంగంలోకి దిగింది. నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఆ యువకుడ్ని చాకచక్యంగా కాపాడింది. ఆ యువకుడ్ని అరవింగ్ గౌడ్‌గా గుర్తించారు. ఆ ప్రమాదం నుంచి బయటపడ్డ తర్వాత.. తాను చనిపోతానేమోనని అనుకున్నానని అరవింద్ తెలిపాడు. దేవుడి రూపంలో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు వచ్చి తనని కాపాడారని అన్నాడు. కాగా.. అరవింద్‌తో పాటు బైక్‌ని కూడా ట్రాఫిక్ పోలీసులు ఆ నీటి ప్రవాహం నుంచి వెలికి తీశారు.