Site icon NTV Telugu

National Flags Distribution: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండాల పంపిణీ

National Flags Distribution

National Flags Distribution

National Flags Distribution: రాష్ట్ర వ్యాప్తంగా 75 ఏళ్ల స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండాలను ప్రజలకు అందించనున్నారు. అయితే ఇప్పటికే చేనేత, పవర్‌ లూమ్‌ కార్మికుల ద్వారా తయారు చేయించిన తిరంగా జెండాలను అందించనున్నారు. అయితే ఈజాతీయ జెండాలను పంపిణీ కోసం రెండు శాఖలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. మండలాల్లో, గ్రామాల్లో ప్రతి వంద ఇళ్లకు ఒక్కొక్కరు చొప్పున అధికారులు, సిబ్బందిని పంచాయతీ రాజ్‌ శాఖ కేటాయించింది. ప్రతి ఐదు గ్రామ పంచాయతీలకు ఒకరికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించి, పంపిణీకి ఆగస్టు 14 వరకు ప్రభుత్వం గడువిచ్చింది.

read also: Tsrtc Independence Day Special Offers: ఆగస్టు15న పుట్టిన వారికి 12 ఏళ్లు వచ్చే వరకు ఉచిత ప్రయాణం

ఈనెల 10 నాటికి సింగరేణి వ్యాప్తంగా జాతీయ జెండాలు పంపిణీ చేయాలని, ఇంటింటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ఉద్యోగులు, పొరుగు సేవల సిబ్బందిని ప్రోత్సహించాలని సంస్థ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా.. సింగరేణి భవన్​లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహణపై అధికారులు సమీక్షించి, 70 వేల త్రివర్ణ పతాకాలను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకుంటున్న సందర్భంగా.. తెలంగాణ ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఆగస్టు 15న పుట్టిన చిన్నారులందరికీ 12 సంవత్సరాలు వచ్చే వరకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధులకు ఆగస్టు 15న ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు పేర్కొంది. దీంతోపాటు రూ.120 టీ24 బస్‌ టికెట్‌ను ఆగస్టు 15న రూ.75కే విక్రయించనున్నట్టు వివరించింది.
Central Government Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నిరాశపర్చే వార్త

Exit mobile version