Narendra Reddy: కరీంనగర్ జిల్లా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ దీక్షపై సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ది దొంగ దీక్ష అన్నారు. పొద్దున 11 గంటలకు ప్రారంభించి మూడు గంటల వరకు రైతుల కొరకు చేసిన దీక్ష దొంగ దీక్ష అని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వంలో రైతుల కొరకు నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతులను అనుగదొక్కింది బీజేపీ అన్నారు. దేశ రాజధాని లో రైతులు బిజెపి చేసిన నల్ల చట్టాలపై దీక్ష చేయడంతో నరేంద్ర మోడీ భయపడి చట్టాలను వెనుకకు తీసుకున్నాడని తెలిపారు.
Read also: Defamation Notice: ఢిల్లీ మంత్రి అతిషికి బీజేపీ పరువు నష్టం నోటీసు..
మళ్లీ నల్ల చట్టాలను సవరిస్తానని మాట తప్పి మోసం చేయడంతో మళ్లీ రైతులు నిరసనకు దిగడంతో రైతులను రబ్బర్ బుల్లెట్లతో అంచవేంచేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రైతుల చట్టాలను వ్యతిరేకిస్తున్న బిజెపి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఇప్పుడు రైతులకు వచ్చిన నీటి సమస్య గత ప్రభుత్వ టిఆర్ఎస్ బాధ్యత తక్షణమే మాజీ సీఎం కేసీఆర్ రైతులకు క్షమాపణ చెప్పి వరి పంటలను పరిశీలించాలని తెలిపారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా కరీంనగర్ ప్రజలకు రైతులకు బిజెపి బండి సంజయ్ ఏం చేశాడో ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలన్నారు. చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ బండి సంజయ్ ఓట్లాడుగాలి గాని కాంగ్రెస్ ను దూషించుకుంటూ ఓట్ల అడగడం విడ్డూరంగా ఉందని వ్యంగాస్త్రం వేశారు.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ తెనాలి పర్యటన వాయిదా.. కారణం ఏంటంటే?