Site icon NTV Telugu

Shamshabad Accident: కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఇంట విషాదం.. రోడ్డుప్రమాదంలో కూతురు దుర్మరణం

Shamshabad

Shamshabad

కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఇంట విషాదం చోటుచేసుకుంది. రోడ్డుప్రమాదంలో కూతురు దుర్మరణం చెందింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయి వద్ద బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఐ20 (TS13 EV5243) కారు డివైడర్ ను ఢీకొట్టంది. కారులో ఫేరోజ్ ఖాన్ కూతురుతో పాటు మరో నలుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఫిరోజ్ ఖాన్ కుమార్తె తఖియా ఖాన్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

read also: Sanjay Raut: సంజయ్‌ రౌత్ అరెస్ట్.. దాదాపు 9గంటల పాటు విచారించిన ఈడీ

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయాలైన వారిని హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్ వైపు నుండి హైదరాబాద్ వస్తుండగా సాతంరాయి అపర్ణా సర్కిల్ వద్దకు రాగానే అదుపుతప్పిన కారు డివైడర్ ను డికొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో తఖియా ఖాన్ తో పాటు మరో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వున్నారు. వారు ఇరానీ కి చెందిన వాళ్ళు గా పోలీసులు గుర్తించారు. శంషాబాద్‌ లో జరిగిన ఓ పార్టీకి హాజరై తిరిగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version