Nama Nageswara Rao: ఒక్కసారి పాలేరు రిజర్వాయర్ కి నీళ్లు వదిలితే పంటలు చేతికి అందుతాయని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు ప్రభుత్వానికి కోరారు. రైతు ఇవాళ కన్నీరు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అప్పలపాలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారి పాలేరు రిజర్వాయర్ కి నీళ్లు వదిలితే పంటలు చేతికి అందుతాయని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. నష్టపోయిన ప్రతి రైతు కూడా ఎకరానికి కనీసం 30 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. రైతుని పొట్టలో పెట్టుకొని కాపాడిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు.
Read also: Vemulawada: రాజన్న ఆలయంలో ముగియనున్న ఉత్సవాలు.. నేడు, రేపు ఆర్జిత సేవలు రద్దు
బీఆర్ఎస్ పార్టీ విద్యుత్ కోత, వర్షాబావ పరిస్థితిల వల్ల ఎండిపోయిన రిజర్వాయర్లని పంట పొలాలని పరిశీలిస్తుంది. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ ను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎంపీలు నామ నాగేశ్వరరావు రవిచంద్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాత మధులు పరిశీలించారు. ఈరోజు ఉదయం నుంచి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ బృందం పర్యటన కొనసాగిస్తుంది. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే పాలేరు రిజర్వాయర్ ఎండిపోయిందని అదేవిధంగా పంట పొలాలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
Vemulawada: రాజన్న ఆలయంలో ముగియనున్న ఉత్సవాలు.. నేడు, రేపు ఆర్జిత సేవలు రద్దు