NTV Telugu Site icon

MLA vs MLC: పండుగపూట డీజేసౌండ్స్ తో మారుమోగిన తిరుమలగిరి.. పోటా పోటీగా రికార్డింగ్‌ డాన్సులు

Mla Vs Mlc

Mla Vs Mlc

MLA vs MLC: మనుషుల ముందు కూర్చున్నప్పుడు చెప్పేవి ఒకటైతే వారి వెనుక చేసేది మాత్రం మరొకటి అనే చెప్పాలి. ఈ కాలంలో జరిగేది ఇలాంటివే. ఎదురుగా మనుషులు వున్నప్పుడు అందరికి మంచి చేయాలి, అందరిలో మనముండాలి, దేవుడంటే భయముండాలి, దేవునికి హారతులివ్వాలి ఇలాంటి నీతులు చెబుతుంటారు. కానీ వెనుక మాత్రం అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ వాటిని చూస్తూ వీరుకూడా ఆనంద పడటం ఇదికథ. ఇలాంటి శ్రీరంగ నీతులు చెప్పే నాయకులే తిరుమల గిరిలో వెలిసారు. నల్లగొండ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దేశ వ్యాప్తంగా రాములోరి కళ్యాణం, ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుంటే.. తిరుమలగిరిలో మాత్రం శ్రీరామ నవమి సందర్భంగా రికార్డింగ్ డాన్సులతో మారుమోగింది. తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రంలో శ్రీరామ నవమి రోజు అమ్మాయిలతో అశ్లీలంగా రికార్డింగ్ డ్యాన్సులు పోగ్రామ్‌ ను ఏర్పాటు చేయించారు. భక్తి శ్రద్దలతో చేయించాల్సిన నవమి వేడుకలను అమ్మాయిలతో డీజే సౌండ్స్‌ తో తిరుమలగిరి మారుగింది. వెనుక శ్రీరామ నవమి అని ప్లెక్సీలు ఏర్పాటు చేసి అందులో శ్రీరాముని బొమ్మకూడా వుండటం విశేషం. దాని ముందు స్టేజ్‌ ఏర్పాటు చేసి అశ్లీలంగా అబ్బాయిలు, అమ్మాయి కలిసి రికార్డింగ్‌ డాన్సులు చేయడం తీవ్ర కలకలం రేపింది. తిరుమలగిరి మండల కేంద్రంలోనే పోటాపోటీ ఆరు ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.

Read also: Donald Trump : డొనాల్డ్‌ ట్రంప్‌కు షాక్.. లైంగిక ఒప్పందం కేసులో నేరారోపణల ధృవీకరణ!

శ్రీరామ నవమి నాడు ఉదయం పూజలతో ప్రారంభమై సాయంత్రం ఆరాముడి ప్లెక్సీలు ఏర్పాటు చేసి.. అక్కడే స్టేజ్‌ పై రాజకీయ నాయకులు కూర్చొని ఆ అశ్లీల దృష్యాలను చూస్తూ ప్రజలను పిచ్చివాళ్లను చేసారు. ఆడీజే సౌండ్స్ కు అక్కడే వున్న యువత, మండల ప్రజలు అందరు కేకలు వేస్తూంటే వారిని చూస్తు ఆనందం వ్యక్తం చేశారు మన రాజకీయ నాయకులు. వారు ఒక రాజకీయ స్థానంలో వుండి పండుగ రోజు ఏమ్మెల్యే వర్సెస్ ఏమ్మెల్సీ (బీజేపీ, కాంగ్రెస్) పోటా పోటీగా ఆర్కెస్ట్రా పోగ్రామ్‌ అను ఏర్పాటు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఒక ఎమ్మల్యే, ఎమ్మెల్సీ స్థానంలో వుండి పండుగ రోజు ఇలాంటి అశ్లీల నృత్యాలు ప్రోత్సహించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా పండుగపూట ఇలాంటి తప్పుచేయకుండా చూడాలని కానీ.. వీరే ఇలా డీజేలు ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అశ్లీల నృత్యాలు చేస్తుంటే దానిని చూసేందుకు వచ్చిన ప్రజలను వెర్రిపప్పల్లా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇదేనా మా ప్రజలంటే, ఇదేనా దేవుడంటే భక్తి, మీడియా ముందు రాముడు గురించి మాట్లాడటం, సాయంత్రం ఆ రాముడినే ప్లెక్సీల్లో పెట్టి స్టేజ్‌ వేసి దాని ముందు ఇలాంటి ఆశ్లీల నృత్యాలు చేయడం అంటూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పై స్థానికులు మండిపడుతున్నారు. పోలీసులు కూడా దీన్ని అడ్డుకోకుండా చూసి చూడనట్టు వ్యవహరించడంపై సర్వత్రా ఉత్కంఠంగా మారింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాల్లో ఉంటే పండుగపూట ఇలాంటి అశ్లీల నృత్యాలతో ఆనందమా? అంటూ మండిపడుతున్నారు. పోలీసులు కూడా దానికి వంతపాడటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Donald Trump : డొనాల్డ్‌ ట్రంప్‌కు షాక్.. లైంగిక ఒప్పందం కేసులో నేరారోపణల ధృవీకరణ!

Show comments