NTV Telugu Site icon

Nagarjuna Sagar: సాగర్‌ 26 గేట్లలో 16 గేట్లు మూసిన వేత.. 10 గేట్ల ద్వారా నీటిని విడుదల

Nagarjuna Sagar

Nagarjuna Sagar

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం, సుంకేశుల నుంచి స్థిరంగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ గేట్లను 26 గేట్లలో 16 గేట్లు మూసి వేశారు ప్రాజెక్ట్ అధికారులు. 10 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో : 1,17,7395 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో : 1,17,7395 క్యూసెక్కులు. ప్రస్తుత నీటిమట్టం : 587.30 అడుగులు. పూర్తిస్థాయి నీటిమట్టం : 590 అడుగులు. ప్రస్తుత నీటి నిలువ సామర్థ్యం : 305 టీఎంసీలు కాగా.. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం : 312.5050 టీఎంసీలుగా కొనసాగుతుంది.

Read also: Narsingi Crime: మై హోమ్ అవతార్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజనీర్లకు తీవ్ర గాయాలు..

ప్రాజెక్టులో జలకళ సంతరించుకోవడంతో పర్యాటకుల రద్దీ కొనసాగుతోంది. సాగర్ అందాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సాగర్ రిజర్వాయర్ గేట్ల నుంచి వదులుతున్న కృష్ణమ్మ అందాలను చూస్తూ పర్యాటకులు తమ ఫోన్లలో సెల్ఫీలు దిగుతూ పరవశిస్తున్నారు. కొందరు కుటుంబ సభ్యులతో, మరికొందరు స్నేహితులతో కలిసి సాగర్ అందాలను చూసేందుకు వస్తున్నారు. ఒకవైపు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూనే మరోవైపు సాగర్ జలాశయం వద్ద పర్యాటకులు సందడి చేస్తున్నారు. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. వాతావరణం కూడా చల్లగా ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు సాగర్ కు చేరుకుంటున్నారు. నీటి ఎద్దడితో సాగర్‌ డ్యామ్‌ను చూడటం చాలా సంతోషంగా ఉందని పలువురు పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. జలాశయం వద్ద రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Social Media Posts: అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత పోస్టులు.. నిందితుడు అరెస్ట్..