అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నల్లగొండకు చెందిన నక్కా సాయి కుమార్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆదివారం ఉదయం అమెరికాలో కాల్చివేతకు గురయ్యాడు. కారులో నక్కా సాయి కుమార్ వెళుతుండగా నల్ల జాతీయులు కాల్పులకు తెగబడ్డారు. అమెరికాలోని మేరీలాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సాయి కుమార్ గత రెండేండ్లుగా మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
అయితే ఆదివారం ఉదయం తన మిత్రుడిని కారులో విమానాశ్రయంలో వదిలి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. అతనిపై ఓ నల్లజాతీయులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో సాయి కుమార్‌అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానిక అధికారులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సాయి కుమార్ మృతితో అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.