NTV Telugu Site icon

Nalgonda Intelligence SP: నల్గొండ ఇంటలిజెన్స్‌ ఎస్పీ గంజి కవితపై వేటు..

Sp Kavitha

Sp Kavitha

Nalgonda Intelligence SP: నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్‌ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. ఆమెను డీజీపీ ఆఫీసుకి ఎటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అక్రమాలు, వసూళ్ల ఆరోపణలతో ఆమెపై ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సొంత సిబ్బందిని సైతం వదలకుండా ఇంటలిజెన్స్ ఎస్పీ భారీగా డబ్బు వసూళ్లు చేసినట్లు టాక్. ఆమె అవినీతిపై సొంత శాఖ సిబ్బందే ఉన్నతాధికారులకు 9 పేజీల లేఖను రాశారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పోస్టింగ్‌ల కోసం లంచాలు తీసుకున్నట్లు ఆరోపించారు. అంతేకాకుండా సిబ్బందితో అధిక వడ్డీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం చేయించినట్లు వారు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ ఆధారంగా ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా.. గంజి కవిత బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి.

Read Also: Tamim Iqbal Retirement: బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ.. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సీనియర్ ప్లేయర్

అయితే, నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్‌ అధికారిగా గంజి కవిత ఏడేళ్ల పాటు విధులు నిర్వహించారు. ఈ ఏడేళ్లలో ఆమె రేషన్, గుట్కా మాఫియాల నుంచి పెద్ద మొత్తంలో వసూల్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. అలాగే, ఓ ఎస్ఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్లతో కవిత ఈ దందా కొనసాగించినట్లు సమాచారం. దీంతో గంజి కవిత షాడో టీంపైనా దర్యాప్తు కొనసాగుతోంది. సమగ్ర విచారణ తర్వాత ఆమెను సస్పెండ్‌ చేసే అవకాశం ఉంది. మరోవైపు, నల్లగొండ, సూర్యపేట జిల్లాల నూతన ఇంటలిజెన్స్ అధికారిగా శ్రీనివాసరావు బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.

Show comments