NTV Telugu Site icon

నల్గొండ బాలికల పాఠశాలలో కరోనా కల్లోలం..

ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించిన కరోనా మహమ్మరి ఇప్పడిప్పుడే తెలంగాణలో తగ్గుముఖం పడుతుంది. ఈ నేపథ్యంలో మరో సారి నల్గొండ జిల్లాలోని ఎస్టీ బాలికల పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. ఎస్టీ బాలికల పాఠశాలలో కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు 8 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణఅయ్యింది.

ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన విద్యార్థులను, ఉపాధ్యాయులకు ప్రత్యేక గదుల్లో చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా వీరితో సన్నిహితంగా ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.