NTV Telugu Site icon

Nagarjuna Sagar: తెరచుకున్న నాగార్జునసాగర్ డ్యాం 6 క్రస్ట్ గేట్లు..

Nagarjuma Sagar Water

Nagarjuma Sagar Water

Nagarjuna Sagar: ఇవాళ నాగార్జున సాగర్‌ గేట్లను అధికారులు ఎత్తివేశారు. ప్రాజెక్టు సీఈ ఉదయం 11 గంటలకు నాగార్జునసాగర్ డ్యాం 6 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్‌కు వరద కొనసాగుతుండటంతో అధికారులు 13, 14 నంబర్ గేట్లను 5 ఫీట్ల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఒకొక్క గేట్ నుండి 5 వేలు.. మొత్తం 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతోన్న అధికారులు. సాయంత్రం వరకు 6 లేదా 8 గేట్లు ఎత్తి.. స్పీల్ వే ద్వారా 2 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. నల్లగొండ, సూర్యాపేట, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఒకొక్క గేట్ నుండి 7300 క్యూసెక్కుల నీటిని.. 43,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.

Read also: Live Sucide Video : చూస్తుండగానే.. మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న వివాహిత

సాగర్ ఇన్ ఫ్లో: 2, 79,000 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో: 30,000 క్యూసెక్కులు. పూర్తి నీటి మట్టం: 590.00 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం: 580 అడుగులు. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 312.50 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం : 280 టీఎంసీకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది. సాగర్ దిగువన ఉన్న కృష్ణా పరివాహక గ్రామాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సాగర్ నిండిపోవడంతో ఆయకట్టు రైతులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.

Read also: Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం పవన్‌ సంచలన వ్యాఖ్యలు..

శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగు నీటి విడుదలకు నీటి ప్రణాళిక యాజమాన్య కమిటీ నిర్ణయించింది. ఈనెల 7 నుంచి కాకతీయ, సరస్వతి, లక్ష్మి కాలువల ద్వార నీటి విడుదల చేయనున్నారు అధికారులు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో జోన్ _1 పరిధిలో కాకతీయ కాలువ ద్వారా ఏడు రోజులు పాటు నీటి విడుదల చేయనున్నారు. జొన్ _2 పరిధిలో ఎల్.ఎం.డి వరకు 8 రోజుల పాటు నీటి విడుదల చేస్తారు. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో 7.56 లక్షల ఎకరాల్లో వానాకాలం సాగు కొనసాగుతుంది.8 రోజుల పాటు అధికారులు నీటి విడుదల ప్రకటనతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Payal Rajput-Prabhas: ప్రభాస్‌తో పెళ్లి.. నిజమైతే బాగుండు అనుకున్నా: పాయల్‌

Show comments