NTV Telugu Site icon

Telangana Graduate MLC: రెండోరోజు గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌.. ఆధిక్యంలో..

Telangana Graduate Mlc

Telangana Graduate Mlc

Telangana Graduate MLC: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు రెండోరోజు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పుడు మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మూడో రౌండ్ లో ఎవరు ఆధిక్యంలో వస్తారన్నదానిపై ఆశక్తి నెలకొంది.

రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు వివరాలు:

* తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్)కు 34,575 ఓట్లు వచ్చాయి.
* రాకేష్ రెడ్డి (బీఆర్‌ఎస్)కు 27,573 ఓట్లు వచ్చాయి
* ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ)కి 12,841 ఓట్లు వచ్చాయి
* స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 11,018 ఓట్లు వచ్చాయి
కాగా.. తీన్మార్ మల్లన్న 7,002 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత తొలి రౌండ్ కౌంటింగ్ వివరాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్‌ మద్దతు తీన్మార్ మల్లన్నకు 36,210 ఓట్లు, బీఆర్‌ఎస్‌ బలపరిచిన రాకేష్‌రెడ్డికి 28,540 ఓట్లు, బీజేపీకి చెందిన ప్రేమేందర్‌రెడ్డికి 11,395 ఓట్లు వచ్చాయి. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్ ముగిసే సమయానికి తీన్మార్ మల్లన్న 7,670 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్‌లో మొత్తం 96,097 ఓట్లు పోలవ్వగా, వాటిలో 88,369 చెల్లుబాటు కాగా, 7,728 చెల్లలేదు. తొలి రౌండ్‌ పూర్తయిన తర్వాత రెండో రౌండ్‌ కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. నల్గొండలోని దుప్పలపల్లి గోదాములో కౌంటింగ్ కొనసాగుతోంది.

Read also: Pinnelli Ramakrishna Reddy: నేటితో ముగియనున్న పిన్నెల్లి మధ్యంతర బెయిల్‌ గడువు..

పట్టభద్రుల ఉప ఎన్నికలో మొత్తం 3 లక్షల 36 వేల ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు నాలుగు రౌండ్లలో పూర్తవుతుంది. పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం అంత తేలిక కాదనే అభిప్రాయాన్ని ప్రధాన పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. అదే జరిగితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతోందని ఆర్వో దాసరి హరిచందన తెలిపారు. ఈరోజు పూర్తి ఫలితం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. గత నెల 27న పోలింగ్ జరగ్గా.. తాజాగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది.
Left parties: కనుమరుగైపోతున్న కమ్యూనిస్టు పార్టీలు..