NTV Telugu Site icon

ఐసోలేషన్ కు తరలింపు: కరోనా సోకిన.. వ్యాపారం ఆగట్లేదు

ఇంతకుముందులా కరోనా సోకిన పేషెంట్లు.. సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండటం లేదు. చాలా మంది వ్యక్తులు కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. భౌతిక దూరం కూడా పాటించడం లేదు. కరోనా సోకినా కూడా బయటకు వస్తున్నారు. మరికొందరైతే తన వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కోవిడ్ పాజిటివ్ పేషెంట్ లు విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. ఓ మహిళ కు కోవిడ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినప్పటికీ ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో అవగాహన లేమితో మాస్క్ లేకుండా స్థానిక కూరగాయల మార్కెట్ లో ఆకుకూరలు అమ్ముతుంది. గుర్తించిన అధికారులు ఆ మహిళను మార్కెట్ నుండి ఐసోలేషన్ కు తరలించారు. అయితే అప్పటికే ఆ మహిళ వద్ద చాలామందే ఆకుకూరలు కొన్నట్లు తెలిపింది. దీంతో వారితో పాటు.. మార్కెట్‌కు వచ్చిన వారంతా ఆందోళన చెందుతున్నారు.