NTV Telugu Site icon

Nalgonda Chopper Crash : ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నది కేవలం ఒక్కరే..

నల్గొండ జిల్లాలోని పెద్దవూర మండలం తుంగతుర్తి సమీపంలో ట్రైనీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.. అయితే జనరల్ ఎవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్ చెందిన సెస్నా 152 ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఇవాళ మార్నింగ్ 10.50 తుంగతుర్తి గ్రామ సమీపంలో క్రాష్ అయ్యింది. మాచర్లలో ఉన్న ఎవియేషన్ ట్రైనింగ్ అకాడమీ నుండి 10.30 కి టేకాఫ్ తీసుకుంది.. టేకాఫ్‌ తీసుకున్న ఇరువై నిమిషాల వ్యవధిలోనే ప్రమాదానికి గురైంది. ఎయిర్ క్రాఫ్ట్‌ను ట్రైనింగ్ పర్పస్, పర్సనల్ వినియోగాల కోసం వాడుతారు. సెస్నా 152 కి టూ సీటింగ్ కెపాసిటీ ఉంది.. గాల్లో ఉన్నప్పుడే ఎయిర్ క్రాఫ్ట్ అదుపుతప్పి చక్కర్లు కొడుతూ ప్రమాదానికి గురయ్యింది.

నేరుగా వచ్చి నేలను తాకింది. దీంతో మహిళా పైలెట్ చనిపోయింది.. ప్రత్యక్ష సాక్షులు వచ్చి చూసే సరికి ఎయిర్ క్రాఫ్ట్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ప్రమాద ఘటన పై డీజీసీఐ, పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన మహిళా పైలెట్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహిమగా గుర్తించారు. ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నది కేవలం మహిళా పైలెట్ మహిమ ఒక్కరేనని అధికారులు స్పష్టం చేశారు.