Site icon NTV Telugu

తెలంగాణకు శుభవార్త.. నాబార్డ్‌ నుంచి 1.66 లక్షల రుణం మంజూరు

తెలంగాణకు నాబార్డు గుడ్‌న్యూస్‌ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి లక్షా 66 వేల 384 కోట్ల రుణ సామర్థ్యంతో నాబార్డు రూపొందించిన రాష్ట్ర దృష్టి పత్రాన్ని మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి విడుదల చేశారు. వ్యవసాయ రంగానికి రుణ పరపతి పెంచాలని.. జనాభాలో 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారని చెప్పారు.

Read Also: కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలి: వీహెచ్

నాబార్డ్ సహకారంతో మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు, కుంటల పునరుద్ధరణతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని.. సుస్థిర వ్యవసాయం ప్రాధాన్యం గుర్తించి పంట వైవిద్యకరణలో భాగంగా రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తున్నామన్నారు.దీర్ఘకాలిక ఆయిల్ పామ్ వంటి పంట సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నదని.. నాబార్డు సూచనల మేరకు క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు ఆయిల్ పామ్ సాగుకు సహకరించాలని తెలిపారు. ప్రతి జిల్లాలో 500 ఎకరాలను గుర్తించి అందులో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్నారు. సహకార రంగానికి నాబార్డు అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని మంత్రులు పేర్కొన్నారు.

Exit mobile version