NTV Telugu Site icon

Mysterious Sound: పెద్దపల్లి జిల్లాలో రాత్రి వేళల్లో వింత శబ్దాలు..

Mysterious Sound In Peddapalli District

Mysterious Sound In Peddapalli District

Mysterious Sound in Peddapalli district: కొద్ది రోజులుగా ఆ ఊరిని వింత శబ్దాలు భయపెడుతున్నాయి. భూగర్భం నుంచి వినిపిస్తున్న అంతుచిక్కని శబ్దాలతో ఊరి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. తమ ఊళ్లో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజులుగా వినిపిస్తున్న అంతుచిక్కని శబ్దాలు ఆ ఊరి వాళ్లను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లిలో రాత్రి వేళల్లో వింత శబ్దాలతో హడలె కలవరపడుతున్నాయి. తనకల్లు మండలంలోని మల్రెడ్డిపల్లి పంచాయతి పెద్దపల్లిలో గత 3 రోజుల నుండి రాత్రి సమయంలో వింత శబ్దాలు రావడంతో గ్రామప్రజలు హడలెత్తిపోతున్నారు. ఈవింత శబ్దాలు కొద్దిరోజుల నుంచే వస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు.

ఇలాగే శబ్దాలు గతంలో కూడా ఇదే విధంగా శబ్దాలు వచ్చినట్లు చెబుతున్నారు. రాత్రి సమయాల్లో గట్టిగా రాళ్ళు వేస్తున్నట్లు, భూమి అదిరేలా భారీ శబ్దాలు వస్తున్నాయని భయాందోళనకు గురవుతున్నామని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా ఇలా చేస్తున్నారా? లేదా భూ ప్రకంపనలా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలా శబ్దాలు రావడంతో భయంగా ఉందని అధికారులు దీని గురించి ఆరా తీయాలని వేడుకుంటున్నారు.

ఇలాంటి ఘటనే సెప్టెంబర్‌ 14న మహారాష్ట్రలోని జరిగింది. మహారాష్ట్ర, లాతూర్ జిల్లా, హసోరి గ్రామంలో ఈ శబ్దాలు వినిపిస్తున్నాయి. వింతగా వినిపిస్తున్న శబ్దాలతో హసోరి గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నరు. అయితే.. శబ్దాలు ఎలా వస్తున్నాయో అర్థం కాక భయపడుతున్నారు. దీంతో అధికారులు ఈ అంశంపై దృష్టి పెట్టారు. జిల్లా అధికారులు ఈ శబ్దాలను పరిశీలించి అసలు విషయం తేల్చాల్సిందిగా ఉన్నతాధికారులను కోరారు. ఇక, కిలారి ప్రాంతంలో 1993లో భారీ భూకంపం సంభవించి 9,700 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే అప్పట్నుంచి ఈ ప్రాంతంలో భూకంపం తిరిగి రాలేదని అధికారులు అంటున్నారు.

Minister Usha Sri Charan: మంత్రి ఉషశ్రీ చరణ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్

Show comments