NTV Telugu Site icon

Mynampally: మీడియాతో మాట్లాడవద్దని ఆనేత ఒట్టు వేయించుకున్నాడు.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు

Mynampalli

Mynampalli

Mynampally Hanumantha Rao: మీడియాతో మాట్లాడవద్దని నాతో ఆనేత ఒట్టు వేయించుకున్నాడని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్ గిరిలో పోటీ చేసినప్పుడే చెప్పాను నాకు రాజకీయ బిక్ష పెట్టిందే మెదక్ జిల్లా అని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు ఇస్తేనే గెలిచానని తెలిపారు. నన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితే నేను తిడతాను అని కీలక వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి వారం రోజులు మల్కాజ్ గిరి నియోజకవర్గంలో పర్యటిస్తానని అన్నారు. వారం రోజుల తర్వాత మీడియాతో మాట్లాడతా అని అన్నారు. బీఆర్ఎస్ లో పెద్ద నాయకుడు నిన్న రాత్రి నాకు ఫోన్ చేశారని, తొందర పడవద్దని నాకు చెప్పారని తెలిపారు. ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని ఆ నేత నాకు సూచించారు. నాతో ఆ నేత ఒట్టు వేయించుకున్నారు…మీడియాతో మాట్లాడవద్దని ఆ నేత కోరారని అన్నారు. నా సత్తా నాకు ఉంది… చర్యకు ప్రతి చర్య ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నన్ను ఏమి అనలేదు.. నేను పార్టీని ఏమి అనలేదని అన్నారు. మెదక్ లో సొంత పార్టీ నేతలపై కేసులు పెట్టారని మండిపడ్డారు. ప్రజల అభిప్రాయమే..నా అభిప్రాయమన్నారు. నేను చేంజ్ కాను…నా వయస్సు 58 ఎండ్లు అంటూ మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మైనంపల్లితో ఒట్టు వేయించుకున్న ఆ నేత ఎవరు? ఎందుకు మీడియాతో మాట్లాడవద్దని అన్నారు? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Read also: Steel Bridge: స్టీల్ బ్రిడ్జి మూసివేత.. పోకిరీల వికృత చేష్టలే కారణమా?

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో తీవ్ర కలకలానికి దారి తీసిన సంగతి తెలిసిందే. తొలి దశ జాబితా ప్రకటించినప్పటి నుంచి హరీష్ రావును టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో హన్మంతరావుపై బీఆర్ఎస్ అధిష్ఠానం సీరియస్ అయింది. ఇప్పటికే ఆయనకు పార్టీ టికెట్ కేటాయించగా.. అభ్యర్థి మార్పు ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో మరో అభ్యర్థిని ప్రకటించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైనట్లు సమాచారం. మల్కాజిగిరి సీటుతో పాటు మెదక్ సీటు కూడా తన కుమారుడికి ఇవ్వాలని హన్మంతరావు గత కొంతకాలంగా కోరుతున్నారు. ఇదే అంశంపై ఆయన ఈ నెల 21న కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే..
Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌