Site icon NTV Telugu

Minister KTR: నేను డాక్టర్ కావాలని మా అమ్మ కోరుకుంది..

Minister Ktr

Minister Ktr

Minister KTR: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ లో ‘ఉమెన్ ఇన్ మెడికల్ కాంక్లేవ్’ ముఖ్యఅతిధిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. నేను డాక్టర్ కావాలని మా అమ్మ కోరుకుందని అన్నారు. కోవిడ్ సమయంలో అందరికీ ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. కానీ.. ఆ సమయంలో ఏ.ఐ.జి మంచి సేవలు అందించిందని అన్నారు. కోవిడ్ సమయంలో అందరికి అందుబాటులో ఉన్న ధరలతో సేవలు అందించారని తెలిపారు. కమర్షియల్, ప్రాఫిట్ కోసం కాకుండా రీసెర్చ్ కోసం అందరికి అందుబాటులో వైద్యం ఉండాలని ఏ.ఐ.జి ప్రారంభించారని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. అందరు ప్రతి ఇంట్లో వారి పిల్లల్లో ఒకరైన డాక్టర్ కావాలని కోరుకుంటారని మంత్రి తెలిపారు.

Read also:Food Poisoning: పెళ్లి భోజనం తిని 100 మందికి పైగా అస్వస్థత..

వైద్యవృత్తి ఎంతో ఉన్నతమైనదని అన్నారు. గత కొన్ని ఏండ్ల నుండి ఇండియా మెడికల్ ఫీల్డ్ లో ఎంతో పురోగతి సాధిస్తుందని అన్నారు. వైద్యులు తమ డ్యూటికి మొదటి ప్రాధాన్యత ఇస్తారని కేటీఆర్‌ పేర్కొన్నారు. వైద్య వృత్తిలో మహిళలు రాణిస్తున్నారని అన్నారు. కోవిడ్ 19 వ్యాక్సిన్ తయారీలో కూడా మహిళల పాత్ర కీలకంగా ఉందని అన్నారు. కొత్త టెక్నాలజీ వల్ల ఉపయోగం ఉండాలని సీఎం కేసీఆర్ ఎప్పుడు అంటుంటారని, ఇండియాలో జెండర్ ఇక్వాలిటీని పాటించే కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని తెలిపారు. తెలంగాణలో మహిళ యూనివర్సిటీ ఏర్పాటు చేసామని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా తెలిపారు.

Exit mobile version