Munugode By Poll: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1గంట వరకు 41.3 శాతం ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నం 12 గంటల వరకూ 30శాతం ఓటింగ్ నమోదైంది. లంచ్ టైం కావడంతో పోలింగ్ కాస్త తగ్గినా.. మళ్లీ 1గంట నుంచి ఓటర్లు భారీగా చేరారు. ఓటు వేసేందుకు క్యూలైన్లో భారీగా వచ్చారు. క్యూలలో మహిళా ఓటర్లే కీలకంగా మారింది. ఇప్పటికే మునుగోడులో బరిలో నిలిచిన అభ్యర్థులు ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు చోట్లు ఏవీఎంలు మోరాయించడంతో.. ఓటర్లు కొద్ది గంటలపాటు క్యూ లైన్ లోనే వైట్ చేయాల్సి వచ్చింది. అయితే అధికారులు స్పందించి ఏవీఎంలను మార్చారు. అనంతరం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈసారి మునుగోడులో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదయ్యే అవకాశం వుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read also: Munugode Bypoll Polling Live Updates: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ లైవ్ అప్ డేట్స్
మునుగోడులో నియోజకవర్గంలో మొత్తం.. 2,41,795 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,21,662, మహిళలు 1,20,126 మంది ఉన్నారు. థార్డ్ జెండర్ 07, ఎన్నారై 10, సర్వీసు ఓటర్లు 50, వికలాంగులు 5686 ఓట్లు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్స్ 318 కాగా, ఎన్నికల బరిలో 47 మంది ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 298 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటుతో పాటు.. వీటిలో 105 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఉప ఎన్నిక కోసం ముగ్గురు కేంద్ర పరిశీలకులు పరిశీలిస్తున్నారు. బందోబస్తు కోసం 3300 పోలీసులు, 15 కేంద్ర బలగాల మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 100 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత 2018 ఎన్నికల్లో 91.5 ఓటింగ్ శాతం నమోదైంది. అయితే.. ఈ సారి ఎంత ఓటింగ్ జరుగుతుందో వేచిచూడాల్సిందే.