Site icon NTV Telugu

Operation Karregutta: కర్రెగుట్టలను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు..

Karreguttalu

Karreguttalu

Operation Karregutta: కర్రెగుట్టలో ఉన్న మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేస్తున్నారు. కర్రెగుట్టల్లోని పై భాగంలో బేస్ క్యాంపు ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 10 వేల మందితో కూడిన బేస్ క్యాంపు ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. బేస్ క్యాంపు సమీపంలో భారీ సెల్ ఫోన్ టవర్లను సాయుధ బలగాలు ఏర్పాటు చేశాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బేస్ క్యాంప్ దగ్గర భారీ స్థాయిలో భద్రతను మోహరించారు. బేస్ క్యాంపు వద్దకు డాగ్ స్క్వాడ్, మైన్ ప్రూఫ్ తో పాటు భారీగా ఆయుధాలను మోహరించారు. మావోయిస్టులు వదిలేసిన బంకర్లు, షెల్టర్ జోన్లను భద్రతా బలగాలు గుర్తించారు.

Read Also: Amit Shah: ‘‘ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు మా పోరాటం ఆగదు’’..

అయితే, కర్రెగుట్టలోని దోబి కొండ, నీలం సారాయి కొండలను ఇప్పటికే భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇక, కర్రెగుట్టలని మావోయిస్టులు ఖాళీ చేసి ఉంటారని వారు భావిస్తున్నారు. కర్రెగుట్టను అన్ని ప్రాంతాల నుంచి స్వాధీనం చేసుకోవడానికి 20 వేల మందికి పైగా సాయుధ బలగాలు సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నాయి.

Exit mobile version