Minister Seethakka: ములుగు ఎన్నో ప్రత్యేకతలకు వేదిక.. అందరూ పర్యటించాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమల శాఖ మంత్రి సీతక్క కోరారు. గ్రామాభివృద్ధికి సీఎస్‌ఆర్ ఫండ్స్ సేకరించాలని కోరారు. ఏసి గదిలో పనిచేసే మీరు అప్పుడప్పుడు అడవి గాలి పీల్చుకోవాలని తెలిపారు. ములుగుకి వచ్చి డిజిటల్ విద్య బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. మీరంతా గ్రామాలకు తరలండి…అటవీ గ్రామీణ పరిస్థితులను చూడాలని కోరారు. విద్యా వ్యవస్థ సరిగా లేనిచోట పర్యటించి ప్రణాళిక రూపొందించాలన్నారు. ఆదివాసి గిరిజన ప్రాంతాల విద్య అభివృద్ధికి కృషి చేస్తే దేవుళ్ళుగా మిమ్మల్ని ఆరాధిస్తారన్నారు. నోరులేని నిస్సహాయుకులకు వద్దకు వెళ్లండి.. ఒక్కో కంపెనీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
Read also: Anushka : హారర్ థ్రిల్లర్ కథతో రాబోతున్న అనుష్క
అప్పుడు మీరే మార్పుకు నాంది పలికిన వారవుతారన్నారు. మనసుంటే మార్గం ఉంటుందన్నారు. చిత్తశుద్ధి, మంచి ఆలోచనలు ఉంటే కఠిన పరిస్థితులను అధిగమించగలుగుతామని అన్నారు. అటవీ శాఖ అభ్యంతరం పెడితే..కంటైనర్ ఆస్పత్రి, కంటైనర్ స్కూల్ ను ఏర్పాటు చేశారని తెలిపారు. ఒక మంచి పని చేస్తే జీవితంలో గొప్ప ఆనందం అనుభూతి మిగులుతుందన్నారు. పుట్టుకకు చావుకు మధ్య ఉన్న సమయాన్ని సమాజ మార్పు కోసం వెచ్చించాలన్నారు. చుట్టూ ఉన్న పల్లెను అభివృద్ధి చేస్తే ఆనందమే వేరన్నారు. ములుగు ఎన్నో ప్రత్యేకతలకు వేదిక. అందరూ పర్యటించాలన్నారు. ఏసి గదిలో పనిచేసే మీరు అప్పుడప్పుడు అడవి గాలి పీల్చుకోవాలని తెలిపారు. ములుగుకి వచ్చి డిజిటల్ విద్య బలోపేతానికి కృషి చేయాలన్నారు. మారుమల గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విద్యను అందించటానికి మీరంతా ముందుకు వచ్చారన్నారు.
Read also: IND vs NZ: రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 450 రన్స్ చేస్తుంది: ఆకాశ్
సారం లేని భూమి విద్య లేని జీవితం ఒక్కటే అన్నారు. అందుకే విద్య అనేది చాలా ముఖ్యమని తెలిపారు. దేశ ముఖచిత్రాన్ని మార్చేది విద్యనే అన్నారు. సమాజంలో ఇంకా అంతరాలు ఉన్నాయన్నారు. విద్యా బోధనలో కూడా అంతరాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యా అవకాశాలు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందన్నారు. మైదాన ప్రాంతాల, అటవీ ప్రాంతాల మధ్య విద్య విషయంలో ఎంతో వ్యత్యాసం ఉందని తెలిపారు. పట్టణ ప్రాంతాలకు మెరుగైన విద్య అందుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారని తెలిపారు. అందుకే విద్యలో ఉన్నంతరాలను తొలగించాలన్నారు. సమానత్వ సాధన దిశలో విద్య కీలకం అని తెలిపారు. హైదరాబాద్ లో ఎలాంటి ఎడ్యుకేషన్ వుందో, మరుమల పల్లెలో అలాంటి విద్య ఉండాలన్నారు. ఆ దిశలో మా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గ్రామీణ విద్యార్థులు అవకాశం కల్పిస్తే బాగా రాణిస్తారన్నారు. కానీ వారికి అవకాశాలు వస్తువులు లేపటం వల్ల వెనుకబాటుతనానికి గురవుతున్నారని తెలిపారు. అందుకే గ్రామీణ విద్యా వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
Read also: Ex Minister Harish Rao: మాజీ మంత్రి బంధువులపై చీటింగ్ కేసు నమోదు..
అందుకు మీ వంతు సహకారం అందించాలని కోరారు. సమాజంలో రెండు వర్గాలు ఉన్నాయని, ఉన్నత విద్యవంతులున్న.. సమాజంలో కనీస విద్యా లేనివారు సమాజంలో ఉండటం బాధాకరమన్నారు. అందుకే అంతరాలను తగ్గించే ఎందుకి మీ వంతు చేయూత ఇవ్వాలన్నారు. అభివృద్ధి వీకేంద్రీకరణ జరగాలి, అప్పుడే అందరికీ సమాన అవకాశాలు అందుతాయన్నారు. అప్పుడు సమాజంలో పోరాటాలు ఉండవని తెలిపారు. పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే మా లక్ష్యం అని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగకపోతే వివక్షతా భావం ప్రజల్లో పెరుగుతోందన్నారు. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. మీకేంద్రీకరణ జరిగితేనే సమానత్వం సాధ్యపడుతుందన్నారు. అచ్చంపేట, ఆదిలాబాద్,ములుగు, భద్రాచలం వంటి అటవీ ప్రాంతాల్లో విద్యా వ్యాప్తికి మీరు ముందుకు రావడం ప్రపంచానికి ఆదర్శం అని తెలిపారు. దేశమా అధిక రంగంలో దూసుకుపోతున్నా నిలువ నీడలేని ప్రజలు ఎంతోమంది ఉన్నారన్నారు. వారికి అండగా మీరు నిలిస్తే ప్రపంచమే హర్షిస్తుందని తెలిపారు. డిజిటల్ విద్యలో ప్రభుత్వ ప్రయత్నములో మీరు భాగస్వాములు కావాలని కోరారు.
Anushka : హారర్ థ్రిల్లర్ కథతో రాబోతున్న అనుష్క