NTV Telugu Site icon

Minister Seethakka: ములుగులో పరిశ్రమ ఏర్పాటు చేస్తాం..

Minister Seetakka

Minister Seetakka

Minister Seethakka: ములుగులో పరిశ్రమ ఏర్పాటు చేస్తామని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. అభివృద్ధి. అంత పట్టణాలకు కేంద్రం అవుతుందన్నారు. పట్టణీకరణతో వలసలు పెరిగాయన్నారు. దీనికి కారణం గ్రామాల్లో ఊపాది లేకపోవడంతో పట్టణాలకు వెళుతున్నారని తెలిపారు. పల్లెల్లో ఉపాధి అవకాశం కలిపించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. అందులో భాగంగా.. గ్రామాల్లో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ములుగులో కూడా పరిశ్రమ ఏర్పాటు చేస్తామని శుభవార్త చెప్పారు. ప్రజల కోసం కాదు బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు.

Read also: Hyderabad: హైదరాబాద్‌లో విక్రయానికి లక్ష ఇళ్లు..గత ఐదేళ్లలో పెరిగిన ధరలు

అధికారం పోయింది అనే అక్కస్సు తోనే కొలువుల కోసం ధర్నాలు అంటున్నారని తెలిపారు. 10 ఏళ్ల అధికారం లో ఉండగా ఒక్క ఉద్యోగం ఇవ్వని వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాల కోసం అంటూ ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఇచ్చామన్నారు. డీఎస్సీ పెట్టినం ఇవి తట్టుకోలేక.. మొన్నటి వరకు అధికారం లో ఉన్నవాళ్లు యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న పడ్డా వర్షాలకు దెబ్బ తిన్న రోడ్ల మరమ్మత్తులకోసం మరిన్ని నిధులు ఇస్తామన్నారు.
Hyderabad: హైదరాబాద్‌లో విక్రయానికి లక్ష ఇళ్లు..గత ఐదేళ్లలో పెరిగిన ధరలు