NTV Telugu Site icon

High Alert: పీఎల్‌జీఏ వారోత్సవాలు.. భద్రతా బలగాలు అలర్ట్..

High Alert

High Alert

High Alert: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఆందోళన కొనసాగుతుంది. గత రెండు రోజులుగా మావోయిస్టులు వర్సెస్ భద్రత బలగాల మధ్య కాల్పులతో హోరెత్తుతుంది. ఈ కాల్పుల్లో ఒక హెడ్ కానిస్టేబుల్ మృతి చెందగా.. నిన్న రాత్రి కూడా మావోయిస్టులకు పోలీసులకు మధ్య పామేడ్ ఏరియాలో కాల్పులు జరిగాయి. అయితే నష్టం వివరాలు ఇంత వరకు సమాచారంలేదు.

రెండు రోజుల నుంచి మావోయిస్టులకి భద్రతా బలగాలకు కాల్పులు..

మావోయిస్టుల కంచుకోట అబుజ్‌మర్ ఏరియాలో పదేపదే కాల్పులు కొనసాగుతున్నాయి. మొన్న నారాయణపూర్ జిల్లా రాయపూర్ ఏరియాలో మావోయిస్టులకి పోలీసులకి మధ్య కాల్పులు జరిగా ఒక కానిస్టేబుల్ మృతి చెందాడు. బీజాపూర్ జిల్లా పామేడి ఏరియాలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. నారాయణపూర్ బీజాపూర్ ఏరియాలో గత రెండు రోజుల నుంచి పలుచోట్ల మావోయిస్టులకి భద్రతా బలగాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

డిసెంబర్ 2 నుంచి 8 వరకు మావోయిస్టు పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని భద్రతబలగాలు అలర్ట్ అయ్యారు. భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్, మహాముత్తారం, పలిమెల, కాటారం, మల్హర్ మండలాలతో పాటు ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. పోలీసులు నిత్యం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వివిధ గ్రామాల్లో పర్యటించి మావోయిస్టులకు సహకరించకుండా స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ వైపు మావోయిస్టుల వారోత్సవాలు, మరోవైపు పోలీసుల తనిఖీలతో గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Show comments