NTV Telugu Site icon

Bogata Waterfalls: బొగతలో జల సవ్వడి.. కనువిందు చేస్తున్న నీటి దార..

Bogatala River

Bogatala River

Bogata Waterfalls: తెలంగాణ నయాగరాగా పేరొందిన ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తుంది. తొలకరి వర్షాలతో బొగత జలపాతంపరవళ్లు తొక్కుతోంది. రెండు రోజులగా ఎగువ ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో కురిసిన వర్షానికి జలకళ సంతరించుకుంది. 50 అడుగుల ఎత్తు నుంచి పాలనురగలా దిగువకు ప్రవహిస్తున్న నీటి దార పర్యాటకులు కనువిందు చేస్తుంది. దట్టమైన అడవి మార్గం గుండా ప్రవహిస్తూ వస్తున్న జల సవ్వడితో జలపాతం అందాలను చూసి పర్యటకులు మురిసిపోతున్నారు. వర్షాలతో నిండిన బొగత జలాశయానికి చూసేందుకు పర్యాటలకు పోటెత్తారు. పరవళ్లు తొక్కుతూ వస్తున్న నీటి ధారలో జలకాలాడేందుకు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు బొగత జలపాతానికి ప్రజలు పోటెత్తారు. జల సవ్వడితో అక్కడి వాతావరణంలో ఆనందంగా గడిపేందుకు వస్తున్న పర్యాటకులతో బొగత జలాశయం నిండిపోయింది.

Read also: Mokshagna: పాన్ ఇండియా డెరైక్టర్ తో మోక్షు లాంఛ్.. సంబరాలకు సిద్ధం కండి!

నయాగరా జలశయానికి తలపించే వాతావరణంలో పర్యటకుల సందడి మొదలైంది. ఈ జలశయానికి చూసేందుకు వరంగల్, హైదరాబాద్‌ నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. జలపాతంలో దిగివ జలసవ్వడిలో జలకాలాడుతూ ఆనందంతో గడిపారు. జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తుండటంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. ఈ ప్రాంతంలో వరద ప్రవాహం ఉండే అవకాశం ఉండడంతో పాటు జలపాతాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకులు కొట్టుకుపోయే ప్రమాదం ఉండడంతో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. నిర్దేశిత ప్రాంతం వరకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసిన అధికారులు ఆ ప్రాంతం దాటి వెళ్లకుండా ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
Uttarpradesh: అప్పటికే నలుగురు భార్యలు.. మరో పెళ్లి చేసుకున్న డాక్టర్.. కట్ చేస్తే