Ramappa Temple: యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లా రామప్ప దేవాలయం పరిధిలోని ఉప ఆలయాలకు రక్షణ కరువైంది. గొల్లాల గుడిలో గుప్తనిధుల కోసం గుర్తు తెలియని దుండగుల చేతిలో ధ్వంసం చేశారు. పురావస్తు శాఖ సిబ్బంది ఆదివారం మధ్యాహ్నం గొల్లాల గుడి దేవాలయం శుభ్రం చేయడానికి వెళ్ళగా దేవాలయం పైకప్పు తీసి కిందపడేసి నిచ్చెన ద్వారా దుండగులు లోపలికి దూరినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. దేవాలయం లోపల శివలింగంతో పాటు శిల్పాలను దుండగులు పెకిలించినట్లు అనుమానిస్తున్నారు. దేవాలయం లోపల పువ్వు ఆకారంలో ఉన్న శిల్పాన్ని పగలగొట్టి పక్కకు పడేశారు దాని కింద గుప్తనిధులు ఉన్నాయని అనుమానంతో పగలగొట్టినట్లు అనుమానిస్తున్నారు. కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న గొల్లాల గుడి శిథిలావస్థలో ఉండగా కేంద్ర ప్రభుత్వ నిధులతో రెండు సంవత్సరాల క్రితం దేవాలయంలోని శిల్పాలతో పాటు శివలింగం పునరుద్ధరణ చేశారు. దేవాలయం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి గేటుకు తాళం వేసి ఉంచుతున్నారు.
Read also: Heavy Rains in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఆలయంలో ధూప దీప నైవేద్యం లేనప్పటికీ.. ఆలయం చుట్టూ పిచ్చి మొక్కలు తొలగించి.. వచ్చే భక్తులు దర్శించుకునేలా అధికారులు ఏర్పాటు చేశారు. కానీ దేవాలయంలోకి భక్తుల దర్శనానికి పురవస్తు శాఖ ఇంకా అనుమతించడం లేదు. పురావస్తు శాఖ అధికారులు దేవాలయం కు రక్షణ కల్పించడంలో విఫలమైనట్లు విమర్శలు వస్తున్నాయి. యునెస్కో గుర్తింపు పొంది రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా పేరెందిన ప్రముఖ శైవ క్షేత్రంగా రామప్ప దేవాలయం విరాజిల్లుతుంది. దాన్ని కాపాడుకుంటూ రక్షించుకోవాల్సిన బాధ్యత పురావస్తుశాఖ అధికారులకు ఉందని పలువురు భక్తులు కోరుతున్నారు దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. పురావస్తు శాఖ అధికారులు ఆలయానికి జరిగిన డ్యామేజీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?