Site icon NTV Telugu

K Laxman: కేసీఆర్ కలలు కంటున్నాడు.. కొత్త డ్రామా మొదలుపెట్టారు

Laxman On Kcr

Laxman On Kcr

MP Laxman Fires on CM KCR Over Bhagwant Mann Telangana Tour: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం కేసీఆర్ ఎన్నో డ్రామాలకు తెరతీశారని, అందులో పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ తెలంగాణ పర్యటన ఒకటని విమర్శించారు. ఒకరినొకరు పొగడటం కోసం క్విడ్ ప్రోకో చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాలు నడుపుతానని కేసీఆర్ కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. కెసిఆర్ నదులకు నడక నేర్పడాని అంటున్నారని.. నడక నేర్పింది నదులకా లేక లిక్కర్‌కా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో ప్రజలు మద్యానికి దూరంగా ఉండగా.. ఇప్పుడు ఇంటింటికీ ఏరులై పారేలా ఆప్ సర్కారు చేసిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ కల్తీ అవుతోందన్న ఆయన.. లిక్కర్ పాలసీని దేశమంతా తేవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

Nikki Haley: రష్యాకు పట్టిన గతే చైనాకు పడుతుంది.. ఘాటు వ్యాఖ్యలు చేసిన నిక్కీ హేలీ..

కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టులను చూసేందుకు వచ్చిన పంజాబ్ సీఎం.. ఆ ప్రాజెక్టుల భూనిర్వాసితుల బాధలను కూడా వింటే ఇంకా బాగుండేదని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం నిర్వాసితులకు ఇప్పటికీ 70 శాతం పరిహారం ఇవ్వలేదు అది చూపించాల్సిందని పేర్కొన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కూడా ఇవ్వలేదన్నారు. కొండగట్టు పేరుతో కేసీఆర్ సరికొత్త డ్రామాను మొదలుపెట్టారన్నారు. తెలంగాణలో భక్తులు దేవాలయాలకు ఇచ్చిన సొమ్ముని ఏం చేస్తున్నారని నిలదీశారు. భక్తుల ద్వారా దేవాలయాలకు వచ్చిన ఆదాయం ఎంత? దేవాదాయశాఖ నుంచి గుడులకు వెళ్తున్నది ఎంత? అని ప్రశ్నించారు. హిందువులను అవమానిస్తున్న మీ సహజ మిత్రులు మజ్లీస్‌పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని అడిగారు. బీజేపీ అధికారంలోకి రాగానే.. దేవాలయాల మీద ప్రభుత్వం పెత్తనం తీసేసి, భక్తుల ఆధ్వర్యంలో చేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Instagram: యూజర్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఆ ఫీచర్‌కు ఇన్‌స్టాగ్రామ్ గుడ్‌బై!

Exit mobile version