Dr.K. Laxman: మోడీ ప్రధాని అయ్యాక 12 వారల్యూటర్నిటి సెలవులు సరిపోవని భావించారు.. అందుకే మెటర్నిటీ సెలవులు 24 వారాలుతో పాటు పూర్తి జీతం అందేలా ఆదేశాలు ఇచ్చారని రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్ అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగుడా పల్లె దవాఖానా వద్ద కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన బేబీ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లల తల్లులకు న్యూట్రిషన్ కిట్స్ అందజేశారు.. అనంతరం పల్లె దవాఖానాను సందర్శించి అక్కడ అవసరమైన ఏర్పాట్లపై డాక్టర్స్ తో మాట్లాడి తెలుసుకున్నారు.. కిడ్నీ సంబంధిత వ్యాధి గ్రస్తుల కోసం డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.
Read also: Electoral Bonds Case: ఎస్‌బీఐకి నోటీసులిచ్చిన సీజేఐ.. ఎలక్ట్రోరల్ బాండ్ డేటాలో బాండ్ నంబర్ ఎక్కడ?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలతో ఎంపీలు అందరూ సంక్షేమ కార్యక్రమాలను చేయాలని సూచించారు. నేను పుట్టిన ఈ ప్రాంతానికి సేవ చేయడానికి ఇక్కడ లేకపోయినా కూడా ONG సంస్థలతో మాట్లాడి ఇక్కడ కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. మహిళల సంక్షేమం కోసం మోడీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గతంలో మెటర్నిటీ సెలవులు కేవలం 12 వారాలు మాత్రమే ఇచ్చేవారని, కానీ మోడీ ప్రధాని అయ్యాక 12 వారల్యూటర్నిటి సెలవులు సరిపోవని భావించాన్నారు. అందుకే మెటర్నిటీ సెలవులు 24 వారాలుతో పాటు పూర్తి జీతం అందేలా ఆదేశాలు ఇచ్చారని క్లారిటీ ఇచ్చారు. గర్భిణీ స్త్రీలకు కావల్సిన ప్రొటీన్లు కూడా అందించేందుకు మోడీ ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. మహిళా సాధికారతకు మోది ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పేద కుటుంబంలో పుట్టిన మోడీ పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి అని తెలిపారు. అందుకే మోడీ ప్రభుత్వం పేదవారి కోసం పనిచేస్తుందన్నారు. ప్రతి పేదవారి వైద్యం అందించాలనే ఆలోచనతో పల్లె దవాఖానా.. బస్తీ దవాఖానా ఏర్పాటు చేశారు మన మోడీ అన్నారు. మహిళల పొగ గొట్టలతో ఇబ్బంది పడకుండా ఉజ్వల గ్యాస్ సిలిండర్లు అందించారన్నారు.
మరుగు దొడ్లు లేక మహిళలు ఎదుర్కుంటున్న సమస్యను నివారించడానికి ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించి మహిళలకు చట్ట సభలలో పాల్గొనే అవకాశం కల్పించారని తెలిపారు. ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ చట్టం నుండి విముక్తి కల్పించింది కూడా మోడీ ప్రభుత్వమే అని తెలిపారు. అసాధ్యాన్ని సుసాధ్యం అయ్యేలా చేసిన ఘనత కూడా మన ప్రధాని మోడీ గారిదే.. అన్నారు. ముద్ర రుణాలు కూడా మహిళలకే ఎక్కువ శాతం అవకాశం కల్పించారని, దేశ వ్యాప్తంగా 4 కోట్ల ఇళ్లు పేదల కోసం నిర్మించారని అన్నారు. సైనిక పాఠశాలల్లో కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పించిన గొప్ప వ్యక్తి ప్రధాని మోడీ అని, తాను పుట్టిన ఈ ప్రాంతానికి నా వంతు సేవ చేయడానికి ఎప్పుడూ నేను సిద్ధంగా ఉంటానని తెలిపారు. తాను స్వయంగా రైల్వే మినిస్టర్ తో మాట్లాడి గట్కేసర్ వరకు ఎంఎంటీఎస్ రైలు పొడిగించానని అన్నారు. అన్నోజిగుడకు జాతీయరహదారి నుండి అండర్ పాస్ ఏర్పాట్లు కూడా చేపించామని క్లారిటీ ఇచ్చారు.
Election Commissioners: ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టిన జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్