MP Arvind: ఉత్తమ్ ను మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయాలని ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్ఆర్సీ అమలు చేయమని మంత్రి ఉత్తమ్ చెప్పడం దేశ ద్రోహమే అన్నారు. ఉత్తమ్ ను మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం ఓట్ల కోసమే కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు. పార్లమెంట్ చట్టాలను అందరూ గౌరవించాల్సిందే అన్నారు. ఉత్తమ్ వ్యాఖ్యలపై సీయం రేవంత్ సమాధానం చెప్పాలి? అని ప్రశ్నించారు.
రాష్ట్రం బాగుండాలంటే నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ ని ఓడించాలన్నారు. ఎన్ఆర్సీ అండ్ సీఏఏ అమలుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై చెప్పాలని అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేఖంగా వ్యవహరిస్తున్న మంత్రి ఉత్తమ్ పై ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఉత్తమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు కళంకం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: YS Sharmila: అక్కడి నుంచే వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం ఆరంభం!
తాజాగా బీఆర్‌ఎస్ నేతలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, కేసీఆర్ కుటుంబం తప్ప మిగతా వారంతా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా సాగుతున్న కాంగ్రెస్ పాలనను చూసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రావని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14 సీట్లు కచ్చితంగా గెలుస్తామని ఉత్తమ్ జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదని మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
Sridhar Babu: వర్షం పడకపోతే తప్పు మాదా?.. కేటీఆర్ పై శ్రీధర్ బాబు ఫైర్