Site icon NTV Telugu

Dharmapuri Arvind: అయ్యో పాపం కవిత.. సాప్ట్ గానే స్ట్రాంగ్ గా కౌంటర్‌ ఇచ్చిన అరవింద్‌

Mp Arvind

Mp Arvind

MP Arvind gave a strong counter to MLC Kavita: ఎంపీ అరవింద్, ఎమ్మెల్సీ కవిత ఒకరిపై ఒకరు కౌంటర్ వార్ కొనసాగిస్తున్నారు. నిన్న అరవింద్ మాటలకు కవిత వీడియో రిలీజ్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేయగా దానికి అరవింద్ మరో వీడియో రిలీజ్ చేస్తూ సాప్ట్ గా కౌంటర్ ఇచ్చారు. ఆ వీడియోలో ఏమన్నారంటే..

అయ్యెపాపం కవితకు బాగలేనట్టున్నది. మన ఎమ్మెల్సీ గారు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారి కూతురు. ఎన్నడు ఏపాపం చేయలే.. రూపాయి తినలేదు. తెలంగాణ ప్రజలను ముంచలేదు. వందరోజుల్లో చెరుకు ఫ్యాక్టరీ తెచ్చింది. పసుపు బోర్డు తెచ్చింది. పసుపు ధర తెచ్చింది. పసుపు ధర తగ్గినప్పుడల్లా కేంద్రానికి కవిత తండ్రి సీఎం కేసీఆర్‌ లెటర్‌ రాసిండు. చెప్పంగానే ఎంఏఎస్‌ పథకం పెట్టి రాసిండు. నీ జీవితానికి నీ వుండే స్థాయి నీవు అర్హురాలివి కాదు. మీ నాన్న కేసీఆర్‌ చేసిన పాపాలు మీ వల్లనే చేసిండు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చచ్చిపోతే రూ.10 లక్షలు ఇస్తారా? మీకైనా కళ్లు బైల్లు కమ్మినాయా? ఎలక్షన్‌ మేనిఫెస్టోలో తెలంగాణలో ఎవరైనా చచ్చిపోతే రూ5లక్షలు ఇస్తా అన్నారు. తెలంగాణలో కోవిడ్‌ మహమ్మారి వచ్చినప్పుడు మొత్తం ఆసుపత్రి పాలై లక్షల డబ్బులు కడుతున్నా ఒక్కరికైనా ఆరోగ్య శ్రీ ఇచ్చినావా కేసీఆర్‌? అని ప్రశ్నించారు. కేంద్రం ఇస్తున్న ఆయుస్మాన్‌ భారత్‌ ఇచ్చినావా? రైతులు పంటలు నష్టపోతావుంటే.. పంటలు మునిగిపోతా ఉంటే.. ఒక్కడికైనా రూపాయి ఇచ్చినావా? అని ప్రశ్నించారు. రైతు చస్తే రూ.5లక్షలు ఇస్తా.. తెలంగాణలో ఎవరైనా చస్తే రూ.5లక్షలు ఇస్తా అనుడు ఏందని మండిపడ్డారు. ఆరోగ్యం చడిపోతే భీమా అయితే ఇవ్వవు గానీ.. చచ్చిపోతే ఇస్తా అనుడు ఇవన్నీ మీ దొరబుద్దులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందుకనే మీరు చస్తే బిల్‌కుల్‌ డబ్బులు ఇస్తా అన్నాను అని అరవింద్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ మేనిఫెస్టో పెడితే మా బీజేపీ కూడా మేనిఫెస్టోలో పెడతది అన్నారు. బిల్‌ కుల్‌ మేనిఫెస్టోలో పెడతా అన్నాను. ఏంది నువ్వు ఆడ బిడ్డవా? తెలంగాణ ఆడ బిడ్డవా? ఇట్లనే చేస్తారా తెలంగాణ ఆడబిడ్డలు? అంటూ ప్రశ్నించారు. నా ఇళ్లు ఇదే గుర్తుపెట్టుకో.. నీ రౌడీ గాళ్లను పంపు.. బ్రోకర్‌ గాళ్లను పంపి.. నేను ఇంట్లో లేనప్పుడు మా అమ్మ ఇక్కటే ఉన్నప్పుడు కొందరిని ఇంటికి పంపి కూర్చీలు, ఇళ్లలో అంతా పగలగొట్టినప్పుడు ఏమైంది నీ ఆడపడచుదనం..అంటూ మండిపడ్డారు. నువ్వేమో ఆడపడుచువి.. మా అమ్మ ఆడపడుచుకాదా? అని ప్రశ్నించారు. నన్ను చెప్పుతో కొడతా అంటావు.. నీకు అంత సీన్‌ ఉందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రోళ్లను కుక్కలు అన్న మాటలు మరిచిపోయారా? అని అరవింద్‌ ప్రశ్నించారు. నీ గురించి ఏమైనా అంటే కూడా తెలంగాణ ప్రజలు హర్షిస్తారు తప్పా.. నయాపైసా సింపతి నీకు రాదన్నారు. తెలంగాణ ప్రజలకు దోచుకుని, యువతకు ఉద్యోగం రాకా.. గంజాయి అలవాటు చేసి.. తెలంగాణ సమాజాన్ని పూర్తిగా నాసనం చేసి మీరు పాపం కట్టుకున్నారు. నీ కన్న మాటలకు తెలంగాణ ప్రజల్లో ముగ్గురు కూడా బాధపడరు అంటూ ఎంపీ అరవింద్‌ సాప్ట్‌ గా సెటైర్‌ వేశారు.
Ritu Varma: చీరకట్టులో సిగ్గులొలికిస్తున్న రీతు వర్మ..

Exit mobile version