NTV Telugu Site icon

Dharmapuri Arvind: టీఆర్ఎస్‌ బంద్ అయ్యి.. బీఆర్ఎస్ రావాలని ఆతృతంగా వుంది

Mp Arvindi

Mp Arvindi

టీఆర్ఎస్‌ బంద్ అయ్యి బీఆర్ఎస్ రావాలని నాకు ఆతృత గా ఉందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేస్తామని మేము చెప్పలేదు అయినా చేసినామ‌న్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించి మోసం చేసింది నీ తండ్రే అంటూ కేటీఆర్ పై మండిప‌డ్డారు. ఎస్సి, ఎస్టీ కమిషన్ తెలంగాణలో లేకుండా పోయిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆత్మ గౌరవ భవనాలు ఎక్కడికి పోయాయ‌ని ప్ర‌శ్నించారు.టీఆర్ ఎస్‌ ఆదివాసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని విమ‌ర్శించారు. ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కాకుండా టీఆర్ ఎస్‌ వ్యతిరేకంగా ఓటు వేస్తుందని మండిప‌డ్డారు. సీబీఐలు మోదీ, అమిత్ షాను తీసుకెళ్లి విచారణ చేయలేదా? అంటూ ప్ర‌శ్నించారు.

తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తప్పితే దేశ వ్యాప్తంగా ప్రతి మారుమూల ప్రాంతాల్లో కరెంటు ఉందని ఎంపీ అర‌వింద్ మండిప‌డ్డారు. రాష్ట్రపతి ఎన్నికలు కాంగ్రెస్, టీఆర్ ఎస్‌ పొత్తుకు తొలి మెట్టు అంటూ ఎద్దేవ చేసారు. కాంగ్రెస్, టీఆర్ ఎస్‌ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయని అన్నారు. బీఆర్ఎస్ ఎక్కడికి పోయిందో సమాధానం చెప్పాలని ప్ర‌శ్నించారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు తెలంగాణకు వస్తే పర్యాటకులా? అంటూ ప్ర‌శ్నించారు. అదే కేసీఆర్ దేశం మొత్తం తిరిగితే ఏ పర్యటకుడో సమాధానం చెప్పాలని నిప్పులు చెరిగారు. ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి భూమి కేటాయించి ఉంటే ఇప్పటికే పూర్తి అయ్యేదని మండిప‌డ్డారు. భూమి కేటాయించలేని వీళ్లు విభజన హామీల గురించి మాట్లాడటం సిగ్గు చేటని ఆగ్రహం వ్య‌క్తం చేసారు.

Jogi Ramesh: గుడివాడ గడ్డ కొడాలి అడ్డా.. ఈక కూడా పీకలేరు..!