NTV Telugu Site icon

Heavy Rain Bhadradri: భద్రాద్రి కొత్తగూడెంలో విషాదం.. వాగులో కొట్టుకుపోయిన తల్లీ కూతుళ్లు

Hevy Rains Bhadradri

Hevy Rains Bhadradri

Heavy Rain Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చాపరాలపల్లి గ్రామ పంచాయతీ కుమ్మరపాడులో విషాదం చోటుచేసుకుంది. ఉధృతమైన ప్రవాహంలో ఇద్దరు కూలీలు కొట్టుకుపోయారు. వ్యవసాయ పనులు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుమ్మరపాడుకు చెందిన కొందరు మహిళా వ్యవసాయ కూలీలు పొరుగు గ్రామానికి పనికి వెళ్లారు. సాయంత్రం ఇంటికి వెళ్లే దారిలో వాగు దాటాల్సి వచ్చింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సుమారు 10 మంది కూలీలు ఒకరి చేతులు మరొకరు జాగ్రత్తగా పట్టుకుని దాటేందుకు ప్రయత్నించారు. నది మధ్యలోకి రాగానే వరద ఉధృతి పెరిగింది. దీంతో తల్లి, కూతురు నదిలో కొట్టుకుపోయారు. వాగు సమీపంలో ఉన్న స్థానికులు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి కూతురిని కాపాడారు. తల్లి నదిలో కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన మహిళ కోసం ప్రస్తుతం అన్వేషణ కొనసాగుతోంది.

Read also: Imran Khan: సైఫర్‌ కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌కు పాక్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ మరోసారి సమన్లు

పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండల కేంద్రంలో కూడా విషాదం నెలకొంది. స్థానిక సబితం జలపాతం అందాలను చూసేందుకు వచ్చిన ఓ యువకుడు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సబితం జలపాతం కొత్త అందాన్ని సంతరించుకుంది. ఉప్పొంగుతున్న నదీ ప్రవాహాన్ని చూసేందుకు యువత ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి తరలివస్తారు. అలా కరీంనగర్ లోని కిసాన్ నగర్ కు చెందిన మానుపాటి వెంకటేష్ అనే యువకుడు ప్రకృతి అందాలను తిలకించేందుకు పెద్దపల్లి వచ్చాడు. స్నేహితులతో కలిసి సరదాగా జలపాతాలు చూసేందుకు వచ్చిన వెంకటేష్‌ను విధి అనుకోకుండా చంపేసింది. స్నేహితులతో సరదాగా గడుపుతున్న వెంకటేష్ ప్రమాదవశాత్తు జలపాతంలో పడి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న అధికారులు జలపాతంలో గాలింపు చర్యలు చేపట్టారు.

Read also: Rains in Warangal: వదలని వానలు.. డేంజర్ జోన్ లో వరంగల్..!

మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని వాగులో ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. కొండేడు గ్రామానికి చెందిన అనూష(18), స్వాతి(18) నీటిలో పడి మృతి చెందారు. కొండేడు వద్ద ప్రవహిస్తున్న దుందుభి వాగును దాటుతుండగా ప్రమాదవశాత్తు వాగులో పడిపోయాడు. వారి ప్రాణాలను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినా కాపాడలేకపోయారు. నదిలోంచి రెండు మృతదేహాలను బయటకు తీశారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రిజర్వాయర్లు నిండిపోయాయి. నీటి ప్రవాహం దగ్గరకు వెళ్లవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వాగులు, చెరువులు, రిజర్వాయర్లు, జలపాతాలు వంటి ప్రమాదకర ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
Food Poisoning: వానాకాలంలో ఫుడ్ పాయిజనింగ్.. దాని లక్షణాలు, నివారణ మార్గాలివే

Show comments