NTV Telugu Site icon

అంచనాలు తారుమారు..! డిగ్రీ కాలేజీల్లో 2 లక్షలకు పైగా సీట్లు ఖాళీ..

తెలంగాణలో డిగ్రీ కాలేజీల్లో భారీగా మిగిలిపోయాయి సీట్లు.. మూడు విడతల కౌన్సిలింగ్‌ ముగియగా ఇప్పటి వరకు రెండు లక్షలకు పైగా సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. దోస్త్ పరిధిలో 947 కాలేజీల్లో 4,16,575 సీట్లు ఉండగా… ఇప్పటి వరకు కాలేజీల్లో సీట్లను 1,96,691 మంది విద్యార్థులు కంఫర్మ్ చేసుకున్నారు.. దీంతో, సుమారు రెండు లక్షల 20 వేల సీట్లు ఖాళీగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.. ఇంటర్‌లో అందరిని పాస్ చేసిన నేపథ్యంలో డిగ్రీలో చేరే వారి సంఖ్య పెరుగుతుందని అనుకున్న ఆ స్థాయిలో విద్యార్థుల నుంచి స్పందన కరువైంది.. కానీ, గత ఏడాదితో పోలిస్తే అడ్మిషన్స్ సంఖ్య స్వల్పంగా పెరిగినట్టు చెబుతున్నారు.