Hyderabad: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని మూసీ నదికి వరద ఉధృతి పెరుగుతోంది. ముసారాంబాగ్ వంతెనను తాకుతూ నది ప్రవహిస్తూనే ఉంది. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని.. అంబర్ పేటలోని లంకా బస్తీ, కమలానగర్, కృష్ణానగర్, తులసీరాంనగర్, అంబేద్కర్ నగర్ తదితర మూసీ పరివాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు టెన్షన్‌కు గురవుతున్నారు.
ముందస్తు చర్యల్లో భాగంగా అంబర్‌పేటలోని మహారాణా ప్రతాప్ హాల్‌లో వీరికి పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు నేడు రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్, శుక్రవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Read also: Hyderabad: పాతబస్తీలో మొహర్రం ఊరేగింపు.. పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు
ఇది ఇలా ఉంటే.. నిన్న హైదరాబాద్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. హుస్సేన్ సాగర్ వరద పరిస్థితిని మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. వర్షాకాలం రాకముందే కాల్వల్లో సిల్ట్ తీశారని వెల్లడించారు. చెరువుల్లో నీటి మట్టం తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. నగరంలో ఎస్‌ఆర్‌డిపి అమలుకు ముందు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. విపత్కర పరిస్థితుల్లో వీలైతే ప్రతిపక్ష పార్టీలు సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. వర్షాలపై రాజకీయం చేయడం సరికాదన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
Tomato: Paytm, ONDC ద్వారా టమాటాలు ఉచిత డెలివరీ.. కండీషన్స్ అప్లై..!