తెలంగాణలోని కొన్ని ప్రాంతాలతో పాటు.. హైదరాబాద్‌లో కుండ పోత వర్షాలు కురుస్తున్నాయి… మంగళవారం.. ఇవాళ ఉదయం నుంచి మూడు నాలుగు దపాలుగా మహానగరంలో భారీ వర్షం దంచికొట్టింది… ఇక, లోతట్టు ప్రాంతాలతో పాటు.. రోడ్లపై వాహనదారులు నరకం చూడాల్సి వచ్చింది.. అయితే, మంగళవారం నుంచి కురుస్తోన్న భారీ వర్షంతో.. పలు కాలనీలు వరదనీటిలో మునిగిపోయాయి… మూసీ నదిలో మళ్లీ వరద పోటెత్తింది. మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసీ ప్రవాహం మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి వెళ్తుండడంతో.. రాకపోకలు నిలిపివేశారు అధికారులు.. ఈ మార్గం నుంచి వెళ్లే ట్రాఫిక్‌ను ఇతర మార్గాల్లో మళ్లించారు. ఇక, ఎప్పుడూ రద్దీగా.. వాహనాల రాకపోకలు కొనసాగించే.. ముసారాంబాగ్ బ్రిడ్జిని మూసివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో.. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Read Also: Raghunandan Rao: మేం క్షమాపణ చెప్పే ప్రసక్తేలేదు.. స్పష్టం చేసిన రఘునందన్
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మెహిదీపట్నం, గోషామహల్, మంగళ్‌హాట్, ఆసిఫ్‌నగర్, ఫలక్‌నూమా, చాంద్రాయణగుట్ట, సంతోష్‌నగర్, ఎల్బీనగర్, అఫ్జల్‌గంజ్, లక్డీకాపూల్, నాంపల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, బాలానగర్, బోయిన్‌పల్లి, శేరిలింగంపల్లి, చిలకలగూడ, తిరుమలగిరి, మారేడుపల్లి, ప్యాట్నీ సెంటర్, బేగంపేట్, సోమాజిగూడ, రాంనగర్, తార్నాక, ఓయూ, అంబర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్ సహాల పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది..
ఇవాళ అవ్వాల్ సర్కిల్‌లో 90.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా… ఎల్బీనగర్‌లో 84.3, మలక్‌పేట్ సర్కిల్ 6లో 77.5, రాజేంద్రనగర్ సర్కిల్ 11లో 71.3, మలక్‌పేట్ సర్కిల్ 6లో 69, షాపూర్‌నగర్ గాజులరామారంలో 68, ఆసమ్‌గాడ్‌లో 65.5. జీడిమెట్లలో 65.3, తిరుమలగిరిలో 63 , కుర్మగూడలో 59.3,ఫలక్‌నుమాలో 57.8, కుత్భుల్లాపూర్‌లో 57.3, శివరాంపల్లిలో 53.5, గాజులరామారంలో 53.3, ఐఎస్ సదన్‌లో 48.3, కూకట్‌పల్లిలో 48.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు ప్రకటించారు.. ఇది ఇవాళ ఉదయం 8.30 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు నమోదైన వర్షపాతం కాగా.. సిటీ వర్షం ఇంకా భారీగానే కురుస్తోంది.