Site icon NTV Telugu

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. వారం కూడా జరగవు..?

Telangana Assembly

Telangana Assembly

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వారం రోజులకు మించి జరిగే అవకాశం లేదని తెలుస్తోంది?. మూడు, నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి, ఈ ప్రభుత్వ హయాంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు. ముందస్తు ఎన్నికల సభ కావడంతో అధికార, ప్రతిపక్షాలు తమ గళం వినిపించేందుకు సిద్ధమయ్యాయి. ఈ సమావేశాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అలాగే మరికొన్ని ముఖ్యమైన అంశాలపై ప్రభుత్వం చర్చించి బిల్లులు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి గురించి, ఇప్పటివరకు ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు, పథకాల గురించి సూత్రప్రాయంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి.

Read also: Russia Crime: దారుణం.. యువతిని 14 ఏళ్లు బంధించి, 1000 సార్లకు పైగా అత్యాచారం

మరోవైపు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్, బీజేపీ రెండూ.. అసెంబ్లీలో ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశాలున్నాయి. వరదలు, వరద నష్టం, పంట నష్టపరిహారం, వరద బాధితుల పరిహారంపై ప్రశ్నలు అడిగే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం విపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని, ఈ సమావేశాల ద్వారా కొన్ని వర్గాలను తమ వైపునకు ఆకర్షించుకునే ప్రయత్నం చేయనున్నట్టు తెలిసింది. ముఖ్యంగా వారిలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తొలగించేందుకు ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అలాగే, అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ ప్రకటించి బలమైన డిమాండ్‌ను కాంగ్రెస్ నీరుగార్చింది.
Wheelchair Insurance: దేశంలోనే తొలిసారిగా ‘వీల్ చైర్ ఇన్సూరెన్స్’.. తీసుకొచ్చిన ఎస్బీఐ జనరల్

Exit mobile version