NTV Telugu Site icon

Munugodu Polling: మునుగోడు పోలింగ్‌.. పట్టుబడ్డ మందుబాటిళ్లు.. డబ్బులు

Yadadri

Yadadri

Munugodu Polling: నేడు మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ మొదలైంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిన్న అర్థరాత్రి నుంచే అధికారులు భారీగా బందోబస్తు నిర్వహించారు. ఇప్పటికే మునుగోడులో ఉప ఎన్నికవేళ నల్గొండ జిల్లా వైపు వెళ్లే అన్ని వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అయినా మునగోడులో డబ్బుల కట్టలు బయట పడుతూనే వున్నాయి. ఓటుకు నోటు వ్యవహారం మాత్రం ఆగలేదు. నిన్న ఓటుకు నోటు ఇవ్వలేదని మునుగోడు ప్రజలు రోడ్డెక్కిన విషయం తెలిసిందే.. కల్యాణ మండపాలతో సహా అన్నింటినీ చెక్‌ చేస్తున్నారు అధికారులు.

Read also: Tirumala : తిరుమలలో కారు కలకలం.. పోలీసులు ఛేజింగ్.. కారు వదిలి లోయలో దూకిన యువకులు

పోలింగ్‌ కు ఎటువంటి అడ్డంకులు ఎదురుకాకుండా ముందుస్తులు అరెస్ట్‌ చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.8 కోట్లను సీజ్‌ చేశారు అధికారులు. మునుగోడు పోలింగ్‌ ప్రారంభమైనవేళ తెల్లవారు జామున యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం పుట్టపాక ఫంక్షన్ హాల్ లో వేరే ప్రదేశాల నుండి వచ్చిన వారు ఫంక్షన్ హాల్ లో ఉన్నారని తెలుసుకున్న అబ్జర్వర్ అక్కడకు చేరుకున్నారు. పుట్టపాక ఫంక్షన్ హాల్ లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారుగా గుర్తించారు. అక్కడ వారిని అదుపులో తీసుకుని వారితో పాటు మండుబాటిళ్లు, డబ్బులను సీజ్ చేశారు. వారిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. వారు ఎక్కడి వారు ఎందుకు ఇక్కడకు వచ్చారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Rahul Gandhi Padayatra Live: సంగారెడ్డిలో రాహుల్ పాదయాత్ర